పెళ్లిచూపులు రెండో సినిమా ఇదే..

TARUN BHASKER

ఇండ‌స్ట్రీ మొత్తాన్ని ఉలిక్కి ప‌డేలా చేయ‌డానికి ఒక్క సినిమా చాలు. పెళ్లిచూపులు సినిమాతో ఇదే చేసాడు త‌రుణ్ భాస్క‌ర్. నేష‌న‌ల్ వైడ్ గా మ‌న సినిమా పాపుల‌ర్ అయింది. హిందీతో పాటు త‌మిళ్ లో కూడా రీమేక్ అవుతుంది పెళ్లిచూపులు. రెండు జాతీయ అవార్డులు వ‌చ్చాయి ఈ చిత్రానికి. ఇంత‌టి సంచ‌ల‌నం త‌ర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నాడు త‌రుణ్ భాస్క‌ర్. ఇక ఇప్పుడు ఈయ‌న రెండో సినిమాపై దృష్టి పెట్టాడు. ఈ చిత్రం రోడ్ థ్రిల్ల‌ర్ గా ఉండ‌బోతుంది. ఇప్ప‌టికే క‌థ చెప్ప‌డం.. షూటింగ్ కు వెళ్ల‌డం కూడా జ‌రిగిపోయాయి. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంతా కొత్త వాళ్లే న‌టిస్తున్నారు. తొలి సినిమాతో త‌న‌కు లైఫ్ ఇచ్చిన సురేష్ బాబు నిర్మాణంలోనే రెండో సినిమా కూడా చేస్తున్నాడు త‌రుణ్ భాస్క‌ర్. హిందీలో వ‌చ్చిన హైవే త‌ర‌హాలో ఇది రోడ్ థ్రిల్ల‌ర్. గోవాలోనే ఎక్కువ భాగం సూటింగ్ జ‌రుపుకోనుంది. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం విడుద‌ల కానుంది. మ‌రి పెళ్లిచూపులుతో సంచ‌ల‌నం సృష్టించిన ఈ కుర్ర ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు రెండో సినిమాతో ఎలాంటి సంచ‌ల‌నానికి తెర తీయ‌నున్నాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here