పెళ్లైనా ఆ.. కాంక్ష‌.. త‌గ్గ‌లేదుగా..!


సాధార‌ణంగా పెళ్లైతే ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు శుభం కార్డ్ ప‌డ్డ‌ట్లే. కానీ కొంద‌రు హీరోయిన్లు మాత్రం పెళ్లి చేసుకున్న త‌ర్వాత కూడా కెరీర్ ను అలాగే లీడ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల‌లో స‌మంత‌.. రాధికా ఆప్టే లాంటి వాళ్లున్నారు. ఇక ఇదే లిస్ట్ లోకి వ‌చ్చే మ‌రో పేరు ఆకాంక్ష సింగ్. గ‌తేడాది మ‌ళ్లీరావా లాంటి ఫీల్ గుడ్ సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది ఈ ముద్దుగుమ్మ‌.
ఆ సినిమాలో మంచి న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో కొన్ని సీరియ‌ల్స్ చేస్తూ బిజీగా ఉంది ఆకాంక్ష‌. దానికి త‌గ్గ‌ట్లే అందాల ఆర‌బోత‌లోనూ ఇలాగే రెచ్చిపోతుంది ఈ బ్యూటీ. ఈ భామ‌కు పెళ్లైపోయింది కూడా. 2013లోనే త‌న బాయ్ ఫ్రెండ్ కునాల్ సైన్ తో ఏడడుగులు న‌డిచింది ఆకాంక్ష సింగ్.
పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలు చేస్తుంది ఈ భామ‌. త‌న కెరీర్ కు భ‌ర్తే ద‌గ్గ‌రుండి ఎంక‌రేజ్ చేస్తున్నాడు అని చెబుతుంది ఆకాంక్ష‌. ఇక ఈ మ‌ధ్యే అదిరిపోయే హాట్ హాట్ షో ఒక‌టి చేసింది ఈ భామ‌. దీనికి కూడా భ‌ర్త నుంచి ప‌ర్మిష‌న్ వ‌చ్చింద‌ని చెబుతూ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది ఈ ముద్దుగుమ్మ‌. మ‌ళ్లీ రావా త‌ర్వాత నాగార్జున‌-నాని మ‌ల్టీస్టార‌ర్ లో అవ‌కాశం అందుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ సినిమాతో తెలుగులో పాతుకుపోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది ఆకాంక్ష‌. మ‌రి ఈమె ఆకాంక్ష ఎంత వ‌ర‌కు తీరుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here