పొగ‌రు చూపిస్తున్న టాప్ క‌మెడియ‌న్..


ఓ సారి చావు వ‌ర‌కు వెళ్లొచ్చినోడెవ్వ‌డూ మ‌ళ్లీ అలాంటి ప‌రాచకాలు ఆడ‌డు. ఎందుకంటే వాడికి చావు భ‌యం ఏంటో తెలుసు కాబ‌ట్టి. అలాగే ఇండ‌స్ట్రీలోనూ అంతే. ఓ సారి పూర్తిగా నాశ‌నం అయిన త‌ర్వాత మ‌ళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన త‌ర్వాత ఎవ‌రూ పొగ‌రు చూపించ‌రు. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఏది చెబితే అది చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ క‌మెడియన్ మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాడు. ఒక‌ప్పుడు ఆయ‌న టాప్ క‌మెడియ‌న్..
కానీ ఇప్పుడు మాత్రం కేవ‌లం క‌మెడియ‌న్ మాత్ర‌మే. అత‌డే వ‌డివేలు. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదేమో… త‌మిళ‌వాడే అయినా కూడా తెలుగులోనూ ఈయ‌న‌కు బాగానే ఇమేజ్ ఉంది. డ‌బ్బింగ్ సినిమాల‌తో ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌ను కూడా ప‌ల‌క‌రించాడు వ‌డివేలు.
జీవితంలో ఓ సారి ప‌డిలేచిన త‌ర్వాత‌.. క‌చ్చితంగా ఏదో ఓ గుణ‌పాఠం నేర్చుకోవాలి. లేదంటే లేచిన దానికి విలువుండ‌దు.. కానీ కొంద‌రుంటారు.. వాళ్లు ఏం చేసినా.. ఎంత పెద్ద షాక్ త‌గిలినా.. చివ‌రికి ఎండ్ కార్డ్ నుంచి మ‌ళ్లీ వెన‌క్కి వ‌చ్చినా కూడా వాళ్లు మార‌రు. కుక్క‌తోక వంక‌ర అన్న‌ట్లు వాళ్ల బుద్ధి మ‌ళ్లీ చూపిస్తుంటారు. ఇప్పుడు వ‌డివేలు విష‌యంలో ఇదే జ‌రుగుతుందేమో అనిపిస్తుంది.
అప్ప‌ట్లో ర‌జినీపై నోటికొచ్చిన క‌మెంట్స్ చేసి అడ్డంగా బుక్క‌య్యాడు. అప్పుడు తొక్కితే ఐదేళ్ళు ఖాళీగా ఉండి ఈ మ‌ధ్యే బిజీ అవుతున్నాడు. మెర్స‌ల్ లో న‌టించి మున‌ప‌టి ఫామ్ అందుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అంత‌లోనే ఈయ‌న‌పై మ‌ళ్లీ షాకింగ్ రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. మ‌నోడిలో ఇంకా మార్పు రాలేద‌ని.. మున‌ప‌ట్లాగే బ‌లుపు చూపిస్తున్నాడ‌నే టాక్ వినిపిస్తుంది.
వ‌డివేలు ప్ర‌స్తుతం శంక‌ర్ శిష్యుడు చింబుదేవన్ ద‌ర్శ‌క‌త్వంలో హింసించే 24వ రాజు పులికేశి సీక్వెల్ చేస్తున్నాడు.
ఈ చిత్ర టైటిల్ కు త‌గ్గ‌ట్లే ఇప్పుడు వ‌డివేలు వాళ్ల‌ను హింసిస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి నిర్మాత శంక‌ర్. తన ప్రవర్తన కారణంగా చిత్రబృందంతో పాటు శంక‌ర్ ను కూడా వ‌డివేలు బాగా ఇబ్బంది పెడుతున్నాడు. షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆపేసి బ‌య‌టికి వ‌చ్చేసాడు. ఈ విష‌యంపై శంక‌ర్ కూడా చాలా సీరియ‌స్ గా ఉన్నాడు. షూటింగ్‌కు సరైన టైమ్ కు రాక‌పోవ‌డం.. రెమ్యూనరేషన్ విషయంలో ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తున్నాడు.
దాంతో వ‌డివేలుపై త‌మిళ నిర్మాత‌ల మండ‌లిలో ఫిర్యాదు చేసాడు శంక‌ర్. దాంతో ఇప్పుడు సినిమా పూర్తి చేయాలి లేదంటే 7 కోట్లు ఫైన్ క‌ట్టాలంటూ వ‌డివేలుకు అల్టిమేట‌మ్ జారీ చేసింది నిర్మాత‌ల మండ‌లి. ఇప్పుడు కానీ మ‌నోడిపై నిర్మాత‌ల మండలి సీరియ‌స్ అయిందంటే వ‌డివేలు కెరీర్ ముగిసిపోయిన‌ట్లే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here