పోసాని.. ప‌వ‌న్ అంత ఎక్కేసాడా..?


ఈ టైటిల్ చూసి ఏదో బూతుగా ఫీల్ అవ్వ‌ద్దు. ఇక్క‌డ ఎక్కేసాడా అంటే బుర్ర‌లోకి ఎక్కేసాడా అని అర్థం. పోసాని బుర్ర‌లో ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ప్ప మ‌రే హీరో లేడు. ఎమ్మెల్యే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఇది అర్థ‌మైపోయింది. ఈయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఎంత‌గా ఆలోచిస్తున్నాడ‌నేది ఎమ్మెల్యే ఈవెంట్ చూసిన వాళ్ల‌కు తెలుస్తుంది. ఇందులో క‌ళ్యాణ్ రామ్ ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ గా మార్చేసాడు ఈ రైట‌ర్ క‌మ్ యాక్ట‌ర్. అవును.. ఎమ్మెల్యే ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ లోనే జ‌రిగింది. ఈ వేడుక‌కు వ‌చ్చిన పోసాని.. క‌ళ్యాణ్ రామ్ గురించి మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నాడు. ఒక్క‌సారి అంటే పొర‌పాటు అనుకోవ‌చ్చు రెండోసారి కూడా ఇదే అన్నాడు. దాంతో అక్క‌డే ఉన్న క‌ళ్యాణ్ రామ్ తో పాటు ఆడిటోరియం మొత్తం షాక్ అయింది. అక్క‌డితో ఆగ‌కుండా క‌ళ్యాణ్ రామ్ రాజ‌కీయాల్లోకి రావాలంటూ ఆహ్వానించాడు. ఇది మీ పార్టీ.. మీ తాత పెట్టిన పార్టీ అంటూ క‌ళ్యాణ్ ను ఊరించి వ‌దిలేసాడు పోసాని. ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఏంటంటే పోసాని టిడిపికి ప‌క్కా వ్య‌తిరేకి. ఆయ‌న జ‌గ‌న్ ను స‌పోర్ట్ చేస్తుంటాడు. వైసిపి త‌ర‌ఫున ఉంటూ క‌ళ్యాణ్ రామ్ ను రాజ‌కీయాల్లోకి ర‌మ్మ‌ని ఆహ్వానిస్తుంటే సీన్ ఎక్క‌డో తేడా కొడుతుంది. మొత్తానికి పోసాని చేసిన ప‌నికి ఎమ్మెల్యే ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా ఒక్క‌సారిగా వేడెక్కి రాజ‌కీయ వాతావ‌ర‌ణం వ‌చ్చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here