ప్రివ్యూ: నేల‌టిక్కెట్టు


నేల‌టిక్కెట్టు అనేది ఒక‌ప్పుడు బాగా ఫేమ‌స్. ఇప్పుడు అది క‌నిపించ‌కుండా పోయింది. కానీ అదే టైటిల్ తో ఇప్పుడు సినిమా చేసాడు ర‌వితేజ‌. ఈ టైటిల్ లోనే కావాల్సినంత మాస్ ట‌చ్ ఉంది. వ‌ర‌స‌గా రెండు విజ‌యాలు అందుకున్న క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్శ‌కుడు కావ‌డంతో క‌చ్చితంగా ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉండ‌టం ఖాయం. మే 25న విడుద‌ల కానుంది ఈ చిత్రం. యుఎస్ లో కూడా భారీగానే విడుద‌ల‌వుతుంది.
కొత్త నిర్మాత రామ్ త‌ళ్లూరి నేల‌టిక్కెట్టును నిర్మించాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇదివ‌ర‌కు ర‌వితేజ సినిమాలు విడుద‌లైన ఫోర్స్ తో కానీ.. అంచ‌నాల‌తో కానీ ఈ చిత్రం రావ‌డం లేదు. అదొక్క‌టే మైస‌న్ గా క‌నిపిస్తుంది ఎందుకో..! అయితే సినిమా బాగుంటే క‌చ్చితంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కుమ్మేయ‌డం ఖాయం.
ఎందుకంటే మాస్ రాజాకు ఆ ఇమేజ్ ఉంది.. మార్కెట్ ఉంది. కాక‌పోతే ఈ మ‌ధ్య అది బ‌య‌ట‌ప‌డ‌టం లేదంతే. రాజా ది గ్రేట్ ఓకే అనిపించినా వెంట‌నే ట‌చ్ చేసి చూడుతో డిజాస్ట‌ర్ ఇచ్చాడు ర‌వితేజ‌. దాంతో ఈయ‌న ఇప్పుడు త‌న‌ను తాను నిరూపించుకోవాల్సిన ప‌నిలో ప‌డ్డాడు. చుట్టూ జ‌నం మ‌ధ్య‌లో మ‌నం అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు క‌ళ్యాణ్. మ‌రి ర‌వితేజ కోరుకుంటున్న విజ‌యాన్ని ఈ చిత్రం ఇస్తుందో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here