ప్ర‌తీ ఫ్రెండూ అవ‌స‌ర‌మేరా అంటున్న అల్ల‌రోడు..


అదేంటి.. అదేదో యాడ్ లో ఉన్న పాట‌ను పాడుకుంటున్నాడు అల్ల‌రి న‌రేష్ అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే చేస్తున్నాడు న‌రేష్. ఇన్నాళ్లూ హీరోగానే న‌టిస్తూ వ‌చ్చిన ఈయ‌న ఇప్పుడు కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కూడా మారిపోతున్నాడు. టైమ్ బాగున్న‌పుడు ఏం చేసినా ఎవ‌రూ అడ‌గ‌రు.
కానీ బాగోలేన‌పుడు మాత్రం ప్ర‌తీది త‌ప్పుగానే క‌నిపిస్తుంది. ఇప్పుడు న‌రేష్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఈయ‌న కెరీర్ బాగున్న‌పుడు అంతా లెక్క‌లు మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎవ‌రూ ఏమీ మాట్లాడ‌టం లేదు. పైగా ఈయ‌న‌కు క‌థల ఎంపిక చేత‌కావ‌ట్లేదంటూ బోన‌స్ గా విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. మ‌రో రాజేంద్ర ప్ర‌సాద్ అవుతాడ‌నుకుంటే.. ఎటు వెళ్లిపోతున్నాడో తెలియ‌ని గ‌మ్యం వైపు వెళ్తున్నాడు అల్ల‌రోడు. ఈయ‌న కెరీర్ తీరం తెలియ‌ని నావ‌లా.. చుక్కాని లేని ప‌డ‌వ‌లా మారిపోయిందిప్పుడు.
ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌న కెరీర్ ఎక్క‌డైతే ఆగిపోయిందో.. అక్క‌డే మ‌ళ్లీ మొద‌లు పెడుతున్నాడు అల్ల‌రోడు. ఈయ‌న సుడిగాడు ద‌ర్శ‌కుడు భీమినేని శ్రీ‌నివాస‌రావుతో ఓ సినిమా చేస్తున్నాడు. సిల్లీఫెలోస్ టైటిల్ తో ఈ చిత్రం వ‌స్తుంది. ఇందులో సునీల్ కూడా ఓ హీరోగా న‌టిస్తున్నాడు. అల్ల‌రి న‌రేష్ చేతిలో ప్ర‌స్తుతం నాలుగు సినిమాలున్నాయి. వాటితో ఇ స‌త్తిబాబు.. కొత్త ద‌ర్శ‌కుడి సినిమాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు మ‌హేశ్ బాబు సినిమాలోనూ అల్ల‌రి న‌రేష్ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. వంశీపైడిప‌ల్లి సినిమాలో ఫ్రెండ్ పాత్ర‌లో అల్ల‌రోడు క‌నిపించ‌బోతున్నాడు. ఈయ‌న‌కు జోడీగా అర్జున్ రెడ్డి ఫేమ్ శాలిని పాండే న‌టిస్తుంది. మొత్తానికి చూడాలి ఏ సినిమాతో న‌రేష్ కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here