ప‌ద్మావ‌తిని ఆపితే మూర్ఖ‌త్వ‌మే..!

Padmavati Scares Balakrishna’s Jai Simha & PSPK25?
సినిమా ఏం ఉందో తెలియ‌దు.. ఎలా తీసాడో తెలియ‌దు.. ఏం తీసాడో కూడా తెలియ‌దు.. ఇవేవీ తెలియ‌కుండానే ప‌ద్మావ‌త్ ను రెండు నెల‌లుగా  ఆపేస్తున్నారు క‌ర్ణిసేన‌. ఇప్పుడు వాళ్లంతా సిగ్గు ప‌డాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది. సినిమా విడుద‌లైంది. ఇప్ప‌టికే ప‌ద్మావ‌త్ సినిమాకు ప‌డిన ప్రీమియ‌ర్ షోస్ అన్నీ గొంతెత్తి సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అని చాటుతున్నాయి. ముఖ్యంగా ప‌ద్మావ‌త్ గా దీపిక ప‌దుకొనే అద్భుతం అంటున్నారు. దానికి తోడు భ‌న్సాలీ టేకింగ్ గురించి వేనోళ్ల పొగుడుతున్నారు. ఇలాంటి సినిమా చూసి చాలా కాల‌మైంది అంటున్నారు. ఆ గ్రాండియ‌ర్.. ఆ రాజ్ పుత్ ల రాజ‌సం.. ప‌ద్మావ‌తి తెగింపు.. ఇవ‌న్నీ సినిమాను నిల‌బెట్టాయి. ఇక ఇవ‌న్నీ ఒకెత్తైతే ర‌ణ్ వీర్ సింగ్ న‌ట‌న మ‌రో ఎత్తు. ఈయ‌న హీరోగా ఉంటూ విల‌న్ గా ర‌ప్ఫాడించాడు ప‌ద్మావ‌త్ లో. జ‌న‌వ‌రి 25న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 2 వేల థియేట‌ర్స్ లో విడుద‌లవుతుంది. ఇప్ప‌టికీ క‌ర్ణిసేన సినిమా ఆప‌డానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. మ‌రి విడుద‌లైన త‌ర్వాత కూడా ఈ సినిమాను ఆపితే వాళ్ల‌కంటే మూర్ఖులు మ‌రొక‌రు ఉండ‌రు. చూడాలి మ‌రి.. వాళ్లు మూర్ఖులో.. మంచోళ్లో మ‌రికొన్ని గంట‌ల్లో తేలిపోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here