ప‌రువు పోతుంద‌ని భ‌య‌పడ్డ చిరంజీవి..


అవును.. ఇది నిజంగా రామ్ చ‌ర‌ణ్ చెప్పిన మాట‌లే. త‌న వ‌ల్ల తండ్రి ప‌రువు పోతుందేమో అని భ‌య‌ప‌డ్డాడ‌ట చిరంజీవి. ఇంట్లో ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న‌పుడు.. ఒక‌రు బాగుండి ఇంకొక‌రు డ‌ల్ గా ఉంటే క‌చ్చితంగా ఇంకొక‌ర్ని చూపించి డ‌ల్ గా ఉన్నోళ్ల‌కు తిట్లు త‌ప్ప‌వు. ప్ర‌తీ ఇంట్లో జ‌రిగేది ఇదే. మెగా కుటుంబంలో కూడా ఇదే జ‌రిగింద‌ని చెప్పాడు రామ్ చ‌ర‌ణ్. చిన్న‌ప్ప‌ట్నుంచీ కూడా త‌మ ఇంట్లో ప‌వ‌ర్ హౌజ్ బ‌న్నీనే అని చెప్పాడు చ‌ర‌ణ్. ఏ వేడుక జ‌రిగినా..
బ‌ర్త్ డే పార్టీ జ‌రిగినా డాన్సులు కుమ్మేసేవాడ‌ని చెప్పాడు ఈ హీరో. తన‌కు మాత్రం సిగ్గో.. భ‌య‌మో తెలీదు కానీ ఎప్పుడూ డాన్సులు అయితే చేయ‌లేద‌ని చెప్పాడు చ‌ర‌ణ్. అది చూసి ఎప్పుడూ బ‌న్నీని చూసి నేర్చుకోరా అంటూ నాన్న త‌న‌ను తిట్టేవాడ‌ని గుర్తు చేసుకున్నాడు చ‌ర‌ణ్. అయితే చిరుత స‌మ‌యంలో మాత్రం త‌న తండ్రికి చాలా భ‌యం వేసింద‌ని.. అస‌లు త‌న‌కు డాన్స్ వ‌స్తుందా రాదా అని భ‌య‌ప‌డ్డాడ‌ని..
డాన్సులు వేయ‌క‌పోతే త‌న ప‌రువు పోతుంద‌ని చిరంజీవి భ‌య‌ప‌డిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయ‌ని చెప్పాడు చ‌ర‌ణ్. ఆ టైమ్ లో చిరుకు ధైర్యం చెప్పి.. చిరుత‌కు ముందు ప్రోత్సాహాన్ని ఇచ్చాడ‌ని చెప్పాడు చ‌ర‌ణ్. అందుకే బ‌న్నీ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెప్పాడు రామ్ చ‌ర‌ణ్. మొత్తానికి మెగా అనుబంధాల‌తో నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుక బాగానే జ‌రిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here