ప‌వ‌న్ ఇక సినిమా స‌న్యాసం..

PAVAN RETIRE FROM MOVIES
అవును.. ఇప్పుడు ఇదే వార్త‌లు వినిపిస్తున్నాయి ఇండ‌స్ట్రీలో. ఇక ఈ ప‌య‌నం చాలు అనుకుంటున్నాడు ప‌వ‌ర్ స్టార్. సినిమాల‌పై ఎప్ప‌ట్నుంచో త‌న‌కు ఇష్టం లేద‌ని చెప్తున్నాడు ప‌వ‌న్. ఆస‌క్తి లేకుండా చేస్తుంటే వాటి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు అర్థం అవుతున్నాయి. ఆయ‌న చేసిన త‌ప్పుకు బ‌య్య‌ర్లు బ‌లైపోతున్నారు. దాంతో ఇక‌పై ఈయ‌న సినిమాలకు కొన్నాళ్లు దూరంగా ఉండాల‌నుకుంటున్నాడు. ఇప్ప‌ట్లో ప‌వ‌ర్ స్టార్ నుంచి మ‌రో సినిమా ఊహించ‌డం క‌ష్ట‌మే. ఆయ‌న రాజ‌కీయాల్లో బిజీ కాబోతున్నారు. పైగా సినిమా అంటే కొంచెం కూడా ఈయ‌న‌కు సీరియ‌స్ నెస్ క‌నిపించ‌ట్లేదు. క‌థ విష‌యంలో కానీ.. టేకింగ్ విష‌యంలో కానీ.. ఎక్క‌డా ప‌వ‌న్ పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఏదో క్రేజ్ ఉంది.. ఓ సినిమా చేసేద్దాం అనే మూడ్ లోనే ఉన్నాడు కానీ నిజంగానే సినిమా అంటే ప్యాష‌న్ మాత్రం ప‌వ‌న్ లో క‌నిపించ‌డం లేదు. అజ్ఞాత‌వాసి తెర‌కెక్కిన విధానం.. అందులో ఉన్న విష‌యం చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.
అయినా త‌న‌కు సినిమాలంటే ఇష్టం లేదు మొర్రో.. కేవ‌లం సినిమాల కోస‌మే చేస్తున్నా అని మొత్తుకుంటున్నాడు ప‌వ‌న్. డ‌బ్బుల కోసం చేస్తే ఇలాగే ఉంటుంది.. ప్యాష‌న్ కోసం మ‌రోలా ఉంటుంది అనే విష‌యం ఇప్పుడిప్పుడే అంద‌రికీ అర్థ‌మవుతుంది. అజ్ఞాత‌వాసి త‌ర్వాత పూర్తిగా రాజ‌కీయాల‌కే ప‌రి మితం అయ్యేలా ఉన్నాడు ఈ హీరో. ఇదే కావాలంటున్నారు అభిమానులు కూడా. ఇలా ఆస‌క్తి లేకుండా సినిమాలు చేసి అన‌వ‌స‌రంగా బ‌య్య‌ర్ల‌ను ముంచ‌డం ఎందుకు.. ఫ్లాపులు తెచ్చుకోవ‌డం ఎందుకు అంటున్నారు వాళ్లు కూడా. ఒక‌టి రెండు కాదు.. వ‌ర‌స‌గా స‌ర్దార్.. కాట‌మ‌రాయుడు త‌ర్వాత ఇది మూడో ప్లాప్.
ఇలాంటి టైమ్ లో ఇప్పుడు ప‌వ‌న్ నుంచి సినిమాలు ఆశించ‌డం అత్యాశే అవుతుంది. తాను సినిమాల‌కు ఇక బ్రేక్ ఇస్తున్న‌ట్లు ఈ మ‌ధ్యే అనౌన్స్ చేసాడు ప‌వ‌ర్ స్టార్. వ‌దిలేయ‌డం అంటే పూర్తిగా వ‌దిలేస్తాడ‌ని అనుకోవ‌డం కాదు.. వీలున్న‌పుడు సినిమాలు కూడా చేస్తాడేమో కానీ ఇప్పుడు త‌న‌కు సినిమాలు చేయ‌డానికి స‌మ‌యం వీలుప‌డ‌ద‌ని చెప్ప‌క‌నే చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. అంతేకాదు.. జ‌న‌సేన ప‌నుల్లో బిజీ అయిపోతున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇప్ప‌టికే ప‌వ‌న్ ఒప్పుకున్న సినిమాలు కూడా ఇప్పుడు సీన్ లోనే క‌నిపించ‌డం లేదు. వాళ్ల‌కు ఇప్ప‌ట్లో న‌టిస్తాడ‌నే న‌మ్మ‌కం కూడా క‌ల‌గ‌డం లేదు. అజ్ఞాత‌వాసి దెబ్బ‌తో ప‌వ‌న్ పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తుంది. క‌థ విష‌యంలో కాస్తైనా జాగ్ర‌త్త‌లు తీసుకునుంటే ఈ రోజు ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాదు క‌దా అంటున్నారు అభిమానులు. మొత్తానికి చూడాలిక‌.. నిజంగానే ఇక‌పై ప‌వ‌న్ సినిమాలు మానేస్తాడేమో.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here