ప‌వ‌న్ ఏంటి అంత మాట అనేసాడు..!


అస‌లే ప‌వ‌న్ కు కోపం ఎక్కువ‌.. ఎప్పుడు ఎవ‌ర్ని ఏమంటాడో తెలియ‌దు.. మ‌ళ్లీ ఇప్పుడు ఎవ‌ర్ని ఏమ‌న్నాడు అనుకుంటున్నారా..? ఈ సారి అన్న‌ది మాత్రం కోపంతో కాదు.. ప్రేమ‌తో. ప‌వ‌న్ తో మాట‌లు ప‌డిన ఆ వ్య‌క్తి కూడా ఎవ‌రో కాదు మాస్ రాజా ర‌వితేజ‌. అవును.. ఈయ‌న ఎప్పుడో ఓ సారి ఫోన్ చేసిన‌పుడు ప‌క్క‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఉన్నాడ‌ట‌.. అప్పుడే ఆయ‌న ఫోన్ తీసుకుని మీరింత సిగ్గు లేకుండా ఎలా ఉంటారు అని ర‌వితేజ‌ను ఫోన్ లో ప‌వ‌ర్ స్టార్ అడిగాడ‌ట‌..
ఈ స‌ర‌దా స‌న్నివేశం నేల‌టికెట్ ఆడియో వేడుక‌లో జ‌రిగింది. ఇద్ద‌రూ త‌మ త‌మ అభిప్రాయాల‌ను స్టేజ్ పై అభిమానుల‌తో పంచుకున్నారు ఈ స్టార్స్. త‌న‌కు ర‌వితేజ‌లా సిగ్గు లేకుండా న‌టించ‌డం రాద‌ని చెప్పాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అంతేకాదు.. అలా చేయలేకే పారిపోయాన‌ని చెప్పాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఇక ర‌వితేజ ఇంత స్టార్ అయ్యాడంటే దాని వెన‌క ఎంతో క‌ష్టం.. కృషి.. ప‌ట్టుద‌ల‌.. క‌న్నీళ్లు ఉన్నాయ‌ని..
అవ‌న్నీ క‌లిపితే ఈరోజు ర‌వితేజ అని గుర్తు చేసాడు ప‌వ‌న్. త‌న‌కు ర‌వితేజ చాలా ఏళ్లుగా తెలుస‌ని.. నిజానికి అన్న‌య్య త‌ర్వాత తాను చూసిన న‌టుడు ర‌వితేజ అని చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. ఎందుకంటే 1991లోనే గ్యాంగ్ లీడ‌ర్ హిందీ రీమేక్ ఆజ్ కా గూండారాజ్ లో న‌లుగురు స్నేహితుల్లో ఒక‌డిగా న‌టించాడు ర‌వితేజ. అప్పుడే ప‌వ‌న్ చూసాడు.. అప్ప‌టికి తానింకా న‌టున్ని కాదు కాబ‌ట్టి ర‌వితేజ త‌న‌ను గుర్తు పెట్టుకున్నాడో లేదో అని చ‌మ‌త్కారాలు కూడా చేసాడు ప‌వ‌ర్ స్టార్. మొత్తానికి నేలటికెట్ ఆడియోలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌లు అంద‌ర్నీ న‌వ్వించాయి.. ఆక‌ట్టుకున్నాయి.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here