ప‌వ‌న్ కు గ‌న్ మెన్ అవ‌స‌రం లేదంట‌..


ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు సినిమా హీరో కాదు.. పొలిటిక‌ల్ లీడ‌ర్. పైగా ఓ పార్టీకి అధినేత‌. అలాంటి వ్య‌క్తికి క‌చ్చితంగా గ‌వ‌ర్న‌మెంట్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందే. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కూడా 2 ప్ల‌స్ 2 గ‌న్ మెన్ ల‌ను ఇచ్చారు. తాను రెండు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించాల్సి ఉంద‌ని..
కాబ‌ట్టి త‌న‌కు సెక్యూరిటీ కావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప‌వ‌న్ కోరాడు. దాంతో ఆయ‌న కోరిక మ‌న్నించి ఆయ‌నకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. కానీ మ‌ళ్లీ ఏమైందో కానీ వాళ్ల‌ను వ‌ద్ద‌ని.. త‌న‌కు సెక్యూరిటీతో ప‌నిలేద‌ని మ‌ర్యాద‌గా సున్నితంగా తిప్పి పంపించేసారు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు.
త‌న పార్టీ స‌మావేశాలు జ‌రుగుతున్న‌పుడు కానీ.. పార్టీ కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన విష‌యాలు కానీ బ‌య‌టికి వెళ్లిపోతున్నాయి. అది గ‌మ‌నించిన ప‌వ‌న్.. అది సెక్యూరిటీతోనే వ‌స్తున్న ఇబ్బంది అని వాళ్ల‌నే వెన‌క్కి పంపిన‌ట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడు జ‌న‌మే సెక్యూరిటీగా జ‌నాల్లోకి వెళ్ల‌బోతున్నాడు జ‌న‌సేనాని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here