ప‌వ‌న్ నే టార్గెట్ ఎందుకు చేస్తున్నారు..?


ప‌ళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బ‌లంటూ ఓ సామెత ఉంది. కానీ ఆ ప‌ళ్లు తింటూ కూడా రాళ్ల‌తో ఎందుకు కొడుతున్నారేంటి అని ఒక్కడు కూడా అడ‌గ‌డు. ఎందుకంటే వాడికి కావాల్సిన ప‌ళ్లు వ‌స్తున్నాయి కాబ‌ట్టి. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ ను కూడా అందుకే వాడేసుకుంటున్నారు.
ఎవ‌డి ఇష్టానికి వాడు ప‌వ‌న్ పేరు మ‌ధ్య‌లో తీస్తున్నాడు. ఇండ‌స్ట్రీలో ఎంతోమంది ఉన్నా కూడా ప‌వ‌న్ మాత్ర‌మే అంద‌రికీ సాఫ్ట్ టార్గెట్ అయ్యాడు. ఏ విష‌యంలో అయినా ప‌వ‌న్ ను మ‌ధ్య‌లోకి లాగ‌డం.. ఆయ‌న పేరు వాడుకోవ‌డం.. వాళ్లు క్రేజ్ తెచ్చుకోవ‌డం కామ‌న్ అయిపోయింది.
మొన్న‌టి వ‌ర‌కు ఓ సుత్తి వాడుకుంది.. ఇప్పుడు ఓ ఛీ రెడ్డి వ‌చ్చి ప‌వ‌న్ ను వాడేసుకుంటుంది. అస‌లు ఇష్యూతో సంబంధం లేక‌పోయినా కూడా మ‌ధ్య‌లోకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని తీసుకురావ‌డం ఫ్యాష‌న్ అయిపోయింది. ఇదంతా ప‌వ‌న్ ను నేరుగా ఎదుర్కోలేక రాజ‌కీయ నాయ‌కులు చేస్తున్న నీచ‌పు కుట్ర‌లా కూడా మారింది.
అస‌లు ప‌వ‌న్ ను అంటే ఎవ‌రూ ముందుకు రారు అని ధైర్యం వాళ్లకు.. అదే ఇండ‌స్ట్రీలో ఉంటూనే రాజ‌కీయాల్లో ప‌ద‌వులు అనుభ‌విస్తున్న బాల‌య్య‌, బాబూమోహ‌న్, ముర‌ళీమోహ‌న్ లాంటి వాళ్ళ‌ను ఈ ఛీరెడ్డి.. సుత్తులు ఎందుకు ప్ర‌శ్నించ‌రు. ఎందుకంటే అక్క‌డికి వెళ్తే తాట తీస్తారు కాబ‌ట్టి.. ప‌వ‌న్ ఒక్క‌డే ఒంటరిగా దొరికాడు కాబ‌ట్టి..! ఇప్పుడైనా అది మానుకుని దేనికోసం ఇదంతా చేస్తున్నారో అది సాధించుకుంటే మంచిది.. లేక‌పోతే తోలు తీస్తాం అంటూ హెచ్చరిస్తున్నారు ప‌వ‌న్ అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here