ఫాతిమా కాలేజీ పై స్పందించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan

కడపలోని ఫాతిమా మెడికల్ కాలేజీ లైసెన్స్ ను మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా మరియు సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేయగా కాలేజీ లో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్టూడెంట్స్ అంతా రోడ్డు మీద పడేస్థితి ఏర్పడింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన చలోరే చలోరే చల్ పర్యటనలో భాగంగా కడప వెళ్లి కాలేజి విద్యార్థులతో చర్చించి వారి బాసట గా నిలుస్తానని మాట ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన ట్విట్టర్లో ఈ విషయం పై స్పందించారు. “కాలేజీ చేసిన తప్పుకి కష్టపడి చదివిస్తున్న తల్లితండ్రుల ఆశలని నిరాశ పరచకండి. వాళ్ళ చమట, నెత్తురు ధారపోసి పిల్లలని చదివించుకుంటున్నారు దయచేసి ఈ వివాదంపై త్వరగా స్పందించండి” అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఉదేశించి ట్వీట్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here