ఫిబ్ర‌వ‌రి 25న గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జ‌రుపుకుంటున్న‌ శ్రీ వాడ‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర క్రియోష‌న్స్ ” దండుపాళ్యం -3

దండుపాళ్యం బ్యాచ్ అంటే సినిమా జనాల్లో క్రేజ్ వుంది.  దండుపాళ్యం 1, దండుపాళ్యం 2 భారీ ఓపెనింగ్స్ తో సూపర్ సక్సెస్ సాధించాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచయిస్ లో చివ‌రి పార్టు గా ధండుపాళ్యం-3 మార్చి 2న రానుంది.  విభిన్నమైన కథాంశంతో, సహజమైన సన్నివేశాలతో, భావోద్వేగమైన నటనతో దండు పాళ్యం చిత్రాలు క్రేజ్ సంపాదించుకున్నాయి. ఇదే ఊపులో దండుపాళ్యం 3 చిత్రం కూడా తెర‌కెక్కింది.  శ్రీనివాస రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సెన్సేషనల్ చిత్రం మ‌రోక్క‌సారి తెలుగు ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేయ‌నుంది.  ఈ చిత్రాన్ని క్రేజీ ఆఫర్ ఇచ్చి శ్రీ వాడ‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర క్రియోష‌న్స్ వారు తెలుగు రైట్స్ ద‌క్కించుకోవ‌టం విశేషం.  శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆశిస్సులతో..  సాయి కృష్ణ ఫిల్మ్స్ సమర్పణలో… శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై  శ్రీనివాస్ మీసాల, రజని తాళ్లూరి  సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. సాయి కృష్ణ పెండ్యాల కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవికాలే ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.   ఈ చిత్రానికి సంభందించి ఫిబ్ర‌వ‌రి 25న భారీగా ప్రీ-రిలీజ్ ఫంక్ష‌న్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ…. దండుపాళ్యం సిరీస్ లో భాగంగా వచ్చిన చిత్రాల‌న్ని ఘ‌న‌విజ‌యాలు సాధించాయి. ఈ సిరీస్ లో భాగంగా దండుపాళ్యం 3 సీక్వెల్ గా రూపొందించాం. ఇదే ఈ సీరీస్ కి చివ‌రి చిత్రం. దర్శకుడు శ్రీనివాస రాజు కథ, కథనం అద్భుతంగా ఉంటాయి.  అద్భుతమైన సన్నివేశాలు మెస్మరైజ్ చేస్తాయి. సహజత్వం కూడిన సన్నివేశాలతో, భావోద్వేగమైన డైలాగులతో ఈ కథ సాగుతుంది.  దండుపాళ్యం 3 చిత్ర ట్రైలర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  అయితే ఈ దండుపాళ్యం సీరిస్ కి ఇదే చివ‌రి పార్టు కావ‌టంతో అస‌లు క్లైమాక్స్ ఎలా వుండ‌బోతుందో అనే ఆశ‌క్తి అంద‌రిలో వుంది. అందుకే ట్రేడ్ లో విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది.   శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆశిస్సులతో..  సాయి కృష్ణ ఫిల్మ్స్ సమర్పణలో శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫిబ్ర‌వ‌రి 25న  భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా చేయబోతున్నాం. మార్చి 2న  వరల్డ్‌వైడ్‌గా దండుపాళ్యం 3 చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్‌ చేయబోతున్నాం” అన్నారు.
ఈ చిత్రానికి
సంగీతం: అర్జున్‌ జన్యా,
సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌,
ఎడిటింగ్‌: రవిచంద్రన్‌,
కో ప్రొడ్యూసర్ – సాయి కృష్ణ పెండ్యాల
నిర్మాతలు:  శ్రీనివాస్ మీసాల, రజనీ తాళ్ళూరి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here