ఫ్లాప్ సినిమాకు రీమేక్ ఏంది రాజా..?

MAHESH BABU MURUGADOSS SRYDER

ఫ్లాప్ సినిమాలు అన్నీ చెడ్డవి కావు.. కానీ కొన్నిసార్లు చెడ్డ సినిమాలే ఫ్లాప్ అవుతుంటాయి. గ‌తేడాది వ‌చ్చిన స్పైడ‌ర్ కూడా అలాంటిదే. మురుగ‌దాస్ తెర‌కెక్కించిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఇండియాలోనే అతిపెద్ద డిజాస్ట‌ర్స్ లో టాప్ 3 లో నిలిచింది ఈ చిత్రం. మ‌హేశ్ బాబు కూడా ఈ చిత్రం ఫ్లాప్ తో కుదేలైపోయాడు. అన్నీ మ‌రిచిపోయి భ‌రత్ అనే నేనుతో మ‌ళ్లీ గాడిన ప‌డ్డాడు మ‌హేశ్.

ఇలాంటి టైమ్ లో స్పైడ‌ర్ టాపిక్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాడు మురుగ‌దాస్. ఇదే ఇప్పుడు అంద‌రికీ షాక్. అస‌లు ఫ్లాప్ సినిమాకు రీమేక్ ఏంటి రాజా అంటూ మురుగ‌దాస్ పై సెటైర్లు కూడా ప‌డుతున్నాయి. ఇదివ‌ర‌కు తుపాకి.. గ‌జిని.. మౌన‌గురు సినిమాల‌ను హిందీలో రీమేక్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు.

ఇప్పుడు స్పైడ‌ర్ కూడా అలాగే అంటున్నాడు. అవంటే హిట్ సినిమాలు కాబ‌ట్టి క‌థ‌లు అక్క‌డికి తీసుకెళ్లాడు. మ‌రి స్పైడ‌ర్ ను ఎందుకు అనే అనుమానాలు ఇప్పుడు వ‌స్తున్నాయి. మ‌రి చూడాలిక‌.. ఈ విష‌యంలో మ‌హేశ్ ఏం అంటాడో..? అస‌లు రీమేక్ సినిమాలంటేనే అంతెత్తున ఎగిరిప‌డే మ‌హేశ్ త‌న రీమేక్ లో కూడా త‌ను న‌టించ‌డేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here