ఫ‌స్ట్ టాక్.. మెహ‌బూబా..!


పూరీ జ‌గ‌న్నాథ్ మ‌రో సినిమాతో వ‌చ్చేసాడు. కాక‌పోతే ప్ర‌తీ సారి వ‌చ్చేదానికి.. ఇప్పుడు వ‌చ్చిన దానికి తేడా ఉంది. ఇన్నాళ్లూ ఇత‌ర హీరోల‌తో ఆయ‌న చేసిన సినిమాలు వ‌చ్చాయి.. కొన్ని ఆడాయి.. కొన్ని పోయాయి. కానీ ఇప్పుడు ఆయ‌న చేసింది కొడుకు ఆకాశ్ తో. పూరీ త‌న కెరీర్ ను ప‌ణంగా పెట్టి మ‌రీ చేసిన సినిమా ఇది. ఎలాగైనా కొడుకును హీరోగా నిల‌బెట్టాల‌ని చేసిన ప్ర‌య‌త్నం. అందుకే ఎప్ప‌ట్లా మాఫియా కాకుండా కొత్త‌గా ఆలోచించాడు.
ఇప్పుడు ఆ ఆలోచ‌న బాగానే ఉంద‌నే టాక్ వ‌చ్చింది. మెహ‌బూబా ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుల‌కు ప‌ర్లేద‌నిపించింది. సినిమా బాగానే ఉంది కానీ అనుకున్నంత మాత్రం లేదంటున్నారు. అయితే పూరీ గ‌త సినిమాల‌తో పోలిస్తే చాలా బెట‌ర్ సినిమాగా.. హానెస్ట్ ప్రేమ‌క‌థ‌గా ఉందంటున్నారు. మ‌రీ ముఖ్యంగా పున‌ర్జ‌న్మ‌ల ప్రేమ‌క‌థను పూరీ డీల్ చేసిన విధానం బాగుందంటున్నారు. కొన్ని డైలాగులు మ‌ళ్లీ పూరీ ఈజ్ బ్యాక్ అనిపించాయి.
ఇక ఆకాశ్ కూడా చాలా బాగా న‌టించాడ‌ని.. తెలుగు ఇండ‌స్ట్రీకి మ‌రో యంగ్ స్ట‌ర్ వ‌చ్చిన‌ట్లే అంటున్నారు. నేహాశెట్టి యాక్టింగ్.. సందీప్ చౌతా సంగీతం కూడా బాగున్నాయి. ఓవ‌రాల్ గా మెహ‌బూబా అబౌ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మ‌రి మ‌హాన‌టిని త‌ట్టుకుని ఈ చిత్రం ఎంత‌వ‌ర‌కు నిల‌బ‌డుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here