బాకీ తీరుస్తున్న బ‌న్నీ..


బాకీ తీర్చ‌డానికి బ‌న్నీ ఎవ‌రికి బాకీ ఉన్నాడు అనుకుంటున్నారా..? ఈయ‌న బాకీ ఉన్న‌ది ఎవ‌రికో కాదు.. అభిమానుల‌కే. అవును.. ఈ మ‌ధ్య హిట్ సినిమాలైతే బాగానే ఇస్తున్నాడు కానీ డాన్సుల విష‌యంలో మాత్రం ఎందుకో డీలా ప‌డిపోయాడు బ‌న్నీ. స‌రైనోడు వ‌ర‌కు దుమ్ము దులిపేసిన అల్లు అర్జున్..
డిజేలో ఎందుకో బాగా సైలెంట్ అయిపోయాడు. దేవీ పిచ్చెక్కించే బీట్లు ఇచ్చినా కూడా డాన్సుల ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి కొత్త‌గా ట్రై చేసాడు బ‌న్నీ. ఫాస్ట్ బీట్స్ కు కూడా స్లో స్టెప్స్ వేసి ఆక‌ట్టుకున్నాడు. కానీ బ‌న్నీ నుంచి అభిమానులు కోరుకునేది మాత్రం ఇది కాదు. ఆయ‌న ర‌ప్ఫాడించే స్టెప్పులు వేస్తుంటే థియేట‌ర్స్ లో సీటీమార్ అంటారు ఫ్యాన్స్. ఇప్పుడు నా పేరు సూర్య‌తో ఆ బాకీ తీర్చ‌డానికి వ‌చ్చేస్తున్నాడు ఈ హీరో.
ఇందులో డాన్స్ ఎలా ఉండ‌బోతుందో ఇప్పుడే చిన్న హింట్ ఇచ్చాడు బ‌న్నీ. తాజాగా విడుద‌లైన ఇరగ ఇర‌గ పాట చూస్తుంటే థియేట‌ర్స్ లో ఇర‌గ‌దీయ‌డం ఖాయం అని అర్థ‌మైపోతుంది. అను ఎమ్మాన్యువ‌ల్ అందాల‌తో పాటు నోట్లో చుట్ట పెట్టుకుని బ‌న్నీ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. మొత్తానికి మే 4న సినిమా విడుద‌ల కానుండ‌టంతో మెల్ల‌గా ప్ర‌మోష‌న్ లో వేగం పెంచేస్తున్నారు చిత్ర‌యూనిట్. విశాల్ శేఖ‌ర్ నా పేరు సూర్య‌కు సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here