బాపురే.. చంద‌మామ చంపేసిందిగా.. 


కాజ‌ల్ చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ రెచ్చిపోయింది. ఈ భామ ఎమ్మెల్యే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్స్ తో బిజీగా ఉంది. క‌ళ్యాణ్ రామ్ తో క‌లిసి ఎమ్మెల్యే కోసం ఇంట‌ర్వ్యూలు ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇందులో భాగంగానే అందాల‌తోనూ రెచ్చిపోతుంది కాజ‌ల్. తాజాగా ఎమ్మెల్యే ప్ర‌మోష‌న్ కు చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో థైస్ చూపిస్తూ కాక పుట్టించింది కాజ‌ల్. ఆ మ‌ధ్య బాలీవుడ్ మోజులో ప‌డి కాస్త డోస్ పెంచేసిన చంద‌మామ‌.. ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఇదే కంటిన్యూ చేస్తుంది. తాజాగా ఎమ్మెల్యేలో బాగానే అందాలు ఆర‌బోసింది ముద్దుగుమ్మ‌. సినిమాలోనే కాదు బ‌య‌ట కూడా ఇలాగే హ‌ద్దులు చెరిపేస్తూ సినిమాపై అంచ‌నాలు పెంచేసింది.
చంద‌మామ హాట్ షోతో ఎమ్మెల్యే బిజినెస్ కూడా పైపైకి వెళ్లిపోయింది. ఈ చిత్రం క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయ్య‌స్ట్ బిజినెస్ చేసింది. 22 కోట్లకు ఈ చిత్రాన్ని అమ్మేసారు. ఉపేంద్ర మాధ‌వ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం మార్చ్ 23న విడుద‌ల కానుంది. గ‌తేడాది వివేగం, నేనేరాజు నేనేమంత్రి సినిమాల్లో ప‌ద్ద‌తిగా క‌నిపించిన ఈ భామ‌.. మెర్స‌ల్ లో బాగానే అందాలు ఆర‌బోసింది. ఇక ఈ మ‌ధ్యే ఫోటోషూట్ ల‌లో కూడా దూకుడు చూపిస్తుంది కాజ‌ల్. మొత్తానికి ఈమె అందాల ఆర‌బోత చూస్తుంటే మ‌రో రెండు మూడేళ్ల పాటు ఇండ‌స్ట్రీలోనే హీరోయిన్ గా ఉండాల‌ని ఫిక్సైపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే ప్ర‌మోషన్ లోనూ రచ్చ చేసింది కాజ‌ల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here