బాబాయ్ అబ్బాయ్.. ఓ వెబ్ సిరీస్..


కొన్ని కాంబినేష‌న్లు ఉంటాయి.. అవి ఎప్పుడెప్పుడు క‌లుస్తాయా అని అభిమానులు కూడా క‌ళ్ల‌లో ఒత్తులేసుకుని చూస్తుంటారు. ఇలాంటి ఓ కాంబినేష‌న్ వెంక‌టేశ్-రానా. ద‌గ్గుపాటి హీరోలు ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తే చూడాలని రానా హీరో అయిన‌ప్ప‌టి నుంచి చూస్తున్నారు అభిమానులు. కానీ ఇన్నేళ్ల‌లో ఏ ఒక్క ద‌ర్శ‌కుడు కూడా వెంకీ.. రానాని క‌లిపే య‌త్నం చేయ‌లేదు. మ‌ధ్య‌లో కొన్ని వార్త‌లు వినిపించినా అది ప‌ట్టాలెక్క‌లేదు. ఇప్పుడు వెంక‌టేశ్, రానాతో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డానికి క‌న్న‌డ ద‌ర్శ‌కుడు రెడీ అయ్యాడు. అయితే అది సినిమా కాదు. వెబ్ సిరీస్.. అవును.. ఎల్టీటీఈ అనే వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు ఐఎమ్ఆర్ ర‌మేష్.
రాజీవ్ గాంధీ మ‌ర్డ‌ర్ చుట్టూ తిరిగే ఈ క‌థ‌లో ఐపిఎస్ ఆఫీస‌ర్ కార్తికేయ‌న్ పాత్ర‌లో నటించ‌బోతున్నాడు వెంక‌టేశ్. రాజీవ్ హ‌త్య కేసులో ఈయ‌న పాత్ర కీల‌కం. ఇక ఇందులో రానా కూడా బాబాయ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. సినిమాల్లో క‌లిసి న‌టించే అవ‌కాశం రాలేక‌పోయినా.. వెబ్ సిరీస్ లో అయినా బాబాయ్ అబ్బాయ్ క‌లిసినందుకు ఆనందిస్తున్నారు అభిమానులు. తొలి సీజ‌న్ అంతా రాజీవ్ గాంధీ మ‌ర్డ‌ర్ చుట్టూ తిరిగి.. రెండో సీజ‌న్ ఎల్టీటీఈ ప్ర‌భాక‌ర‌న్ చుట్టూ తిరుగుతుంద‌ని తెలుస్తుంది. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీల్లోనూ ఈ వెబ్ సిరీస్ రూపొంద‌నుంది. జ‌న‌వ‌రిలో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొద‌లు కానుంది.                                                    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here