బాబాయ్ దెబ్బేసాడు.. అబ్బాయి మందేసాడు..


అవును.. అంతేగా మ‌రి..! ఈ ఏడాది టాలీవుడ్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సినిమా అజ్ఞాత‌వాసి. ఖైదీ నెం.150 రికార్డుల్ని ఈ చిత్రం దాటేస్తుంద‌ని అభిమానులు ఆశ‌లు పెట్టుకున్నారు. ట్రేడ్ కూడా ఇదే న‌మ్మింది. ఎందుకంటే ఈ చిత్రంపై ఉన్న అంచ‌నాలు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్.. త్రివిక్ర‌మ్ మ్యాజిక్.. ఇలా అన్నీ అజ్ఞాత‌వాసిపై అంచ‌నాలు భారీగా పెంచేసాయి. కానీ చివ‌రికి ఏమైంది.. ఈ చిత్రం అత్యంత దారుణంగా దెబ్బేసింది. 150 కోట్లకు పైగా బిజినెస్ చేస్తే వ‌చ్చింది 56 కోట్లే.
అంటే సినిమా ఎంత ముంచేసిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇంత‌టి భారీ న‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డాలంటే ఏం చేయాలి..? అజ్ఞాతవాసి ఇచ్చిన షాక్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకోలేదు ఇండ‌స్ట్రీ. పైగా ఈ ఏడాది ఒక్క పెద్ద సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ కాలేదు. దాంతో దారుణంగా ఉంది ఇండ‌స్ట్రీ ప‌రిస్థితి. ఇలాంటి టైమ్ లో వ‌చ్చిన రంగ‌స్థ‌లం మ‌ళ్లీ ఊపిరి ఊదుతుంది. అప్పుడు బాబాయ్ కొట్టిన దెబ్బ‌కు ఇప్పుడు అబ్బాయి వ‌చ్చి మందు పూస్తున్నాడు.
ఈ చిత్రం అద్భుత‌మైన క‌లెక్ష‌న్లతో రికార్డులు సృష్టిస్తుంది. ఇంటా బ‌య‌టా ఇప్పుడు రంగ‌స్థ‌లం ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది. ఈ చిత్ర దూకుడు చూస్తుంటే 100 కోట్ల వైపు కూడా అడుగులు ప‌డుతున్నాయి. మొత్తానికి అప్పుడు బాబాయ్ కోలుకోలేని షాక్ ఇచ్చినా.. ఇప్పుడు అబ్బాయి వ‌చ్చి దాన్ని మ‌రిచిపోయేలా చేస్తున్నాడ‌న్న‌మాట‌. ఏదైతేనేం మెగా కుటుంబం బాకీ మ‌ళ్లీ వాళ్లే తీర్చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here