బాల‌య్య‌.. ఆ డాన్సులేంద‌య్యా..? 

Jai Simha Audio On Dec 24 At Vajra Grounds, Vijayawada – Grand Release On Jan 12, 2018
ఇండ‌స్ట్రీలో డాన్స్ చేయాలంటే చిరంజీవి.. ఆ త‌ర్వాత బాల‌కృష్ణే. ఇప్పుడు ఎంత‌మంది కుర్ర హీరోలు వ‌చ్చినా కూడా ఈ ఇద్ద‌రి త‌ర్వాతే ఎవ‌రైనా. 25 ఏళ్లుగా ఈ ఇద్ద‌రూ డాన్సుల‌తో కుమ్మేస్తున్నారు. చిరంజీవి అయినా కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చాడు కానీ బాల‌య్య మాత్రం కంటిన్యూస్ గా కుమ్మేస్తున్నాడు. 58 ఏళ్ళ వ‌య‌సులో ఇప్ప‌టికీ అదిరిపోయే డాన్స్ మూవెంట్స్ తో కుర్రాళ్ల‌కే స‌వాల్ విసురుతుంటాడు బాల‌య్య. కుర్రాళ్లు కూడా చేయ‌డానికి భ‌య‌ప‌డే స్టెప్పుల‌తో ర‌చ్చ చేస్తుంటారు బాల‌య్య‌. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న జై సింహాలో న‌టిస్తున్నాడు. ఇందులోని అమ్మ‌కుట్టి పాట న్యూ ఇయ‌ర్ స్పెష‌ల్ గా విడుద‌లైంది. ఇందులో ఫ్లోర్ మూవెంట్స్ తో అద‌ర‌గొట్టాడు బాల‌కృష్ణ‌. ఈ పాట‌లో బాల‌య్య ఎన‌ర్జీ లెవ‌ల్స్ చూసి ద‌ర్శ‌కుడు కేఎస్ ర‌వికుమార్ కూడా షాక్ తింటున్నాడు. అస‌లు ఈ ఏజ్ లో బాల‌య్య వేస్తోన్న స్టెప్పుల‌కు త‌న‌కు మైండ్ తిరిగిపోతుందని చెబుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ త‌న‌ను కొట్టేవాళ్లు లేర‌ని జైసింహా ట్రైల‌ర్ తోనే నిరూపించాడు బాల‌కృష్ణ‌. ఇప్పుడు డాన్సుల్లోనూ ఇదే చేస్తున్నాడు. జ‌న‌వ‌రి 12న జై సింహా విడుద‌ల కానుంది. ఇందులో న‌య‌న‌తార‌తో పాటు న‌టాషా దోషి, హ‌రిప్రియ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here