బాల‌య్య దూకుడు ఆప‌త‌ర‌మా..?

interesting details about Balakrishna's NTR biopic
బాల‌య్య అంటే బాల‌య్యే. ఆయ‌న దూకుడు ఆప‌డం ఎవ‌రి త‌రం కాదు. వ‌య‌సును అస్స‌లు ప‌ట్టించుకోడు ఈయ‌న‌. ఇప్పుడు కాస్త రెస్ మోడ్ లో ఉన్నాడు కానీ లేదంటే ఈ గ్యాప్ లో మ‌రో సినిమా పూర్తి చేసేవాడేమో. జై సింహా త‌ర్వాత ఆర్నెళ్ల‌కు పైగా గ్యాప్ తీసుకుంటున్నాడు బాల‌కృష్ణ‌. ఈ గ్యాప్ కు కార‌ణం ఎన్టీఆర్ బ‌యోపిక్. చాలా ఏళ్ళ త‌ర్వాత ఇంత భారీ గ్యాప్ తీసుకున్నాడు బాల‌య్య‌. తాజాగా ఈయ‌న రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం హిందూపూర్ లో ప‌ర్య‌టిస్తున్నారు. అక్క‌డే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కూడా సెటైర్ వేసాడు బాల‌య్య‌. అన‌వ‌స‌రంగా ఆయ‌న గురించి మాట్లాడి ఒక‌ర్ని హీరో చేయ‌డం ఇష్టం లేద‌ని.. తాము సూప‌ర్ స్టార్స్ అని చెప్పాడు బాల‌య్య‌.
ఇక సినిమాల విష‌యంలోనూ ఈయ‌న దూకుడు మామూలుగా లేదిప్పుడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆగ‌స్ట్ నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. ఈ సినిమా సంక్రాంతికి విడుద‌ల కానుంది. తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇక దీంతోపాటు మ‌రో రెండు సినిమాలు కూడా చేయ‌బోతున్నాడు బాల‌య్య‌. ఇప్ప‌టికే బోయ‌పాటి శీనుతో ఓ సినిమా క‌న్ఫ‌ర్మ్ చేసాడు బాల‌య్య‌. ఈ చిత్రం కూడా ఇదే ఏడాది ప‌ట్టాలెక్క‌నుంది. వెట‌ర‌న్ ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డితో బాల‌య్య ఓ సినిమా చేయ‌బోతున్నార‌నే వార్త‌లే ఇప్పుడు నంద‌మూరి ఫ్యాన్స్ కు టెన్ష‌న్ తెప్పిస్తున్నాయి. ఈ సినిమాతో పాటు పూరీ జ‌గ‌న్నాథ్ తోనూ బాల‌య్య ఓ సినిమా చేయ‌బోతున్నాడు. మొత్తానికి మ‌రో రెండేళ్ల పాటు బాల‌య్య దూకుడు మామూలుగా లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here