బాల‌య్య పిలిస్తే రానంటారా..? 

 
ఇండ‌స్ట్రీలో బాల‌య్య అంటే ఓ రూల‌ర్. మంచి వాళ్ల‌కు మంచి.. చెడువాళ్ల‌కు చెడు అంటారు. కానీ ఆయ‌నంటే అంద‌రికి ఇష్ట‌మే. ఎందుకంటే చిన్న పిల్లాడి మ‌న‌స్త‌త్వం బాల‌య్య‌ది అని ఆయ‌న గురించి తెలిసిన వాళ్లంటారు. ఆయ‌న ఒక్క మాట చెబితే కానిప‌ని ఉండ‌దు.. ఆయ‌న అడిగితే వేడుక ఏదైనా రాని వాళ్లంటూ ఉండ‌రు. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ మ‌రోసారి దీనికి వేదికైంది. ఈ ఓపెనింగ్ లో ఇండ‌స్ట్రీ అంతా క‌నిపించింది. ముఖ్యంగా బాల‌య్య‌తో ప‌ని చేయ‌బోయే ద‌ర్శ‌కులు.. చేస్తోన్న ద‌ర్శ‌కులు.. చేసిన ద‌ర్శ‌కుల‌తో రామ‌కృష్ణ స్టూడియోస్ అంతా సంద‌డి సంద‌డిగా మారిపోయింది స‌రిగ్గా రెండేళ్ల కింద హైద‌రాబాద్ లో త‌న 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఈవెంట్ చేసాడు బాల‌య్య‌. అందులో చిన్నాపెద్ద తేడా లేకుండా ఇండ‌స్ట్రీ అంతా క‌దిలొచ్చింది. చిరంజీవితో పాటు సిఎం కేసీఆర్ కూడా వ‌చ్చారు. ఇప్పుడు కూడా ఇలాంటి సీన్ రిపీట్ అయింది. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఓపెనింగ్ లో ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖ ద‌ర్శ‌కులంతా క‌దిలి వ‌చ్చారు. బోయ‌పాటి శీను.. సుకుమార్.. తేజ‌.. వినాయ‌క్.. రాఘ‌వేంద్ర‌రావ్ తో పాటు ఇండ‌స్ట్రీ అంతా త‌ర‌లివ‌చ్చింది. ఇంత‌మంది ద‌ర్శ‌కుల‌ను ఒకేచోట చూసి అభిమానులు కూడా ఉప్పొంగిపోయారు. ఇక ముహూర్త‌పు షాట్ లో బాల‌య్య అలా ధుర్యోధ‌నుడిగా న‌డిచొస్తుంటే అచ్చంగా అన్న‌గారిని చూసిన‌ట్లే అంతా మురిసిపోయారు. మొత్తానికి ఎన్టీఆర్ బ‌యోపిక్ క‌న్నుల పండ‌గ‌గా జ‌రిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here