బాల‌య్య రెండు పడ‌వ‌ల ప్ర‌యాణం..


రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం ఎప్ప‌టికైనా డేంజ‌రే. ఎప్పుడు కాలు జారుతుందో తెలియ‌దు. జారిందా అంతే సంగ‌తులు. ఇప్పుడు బాల‌య్య కూడా ఇదే చేస్తున్నాడు. సినిమా రాజ‌కీయాలు రెండు పడ‌వ‌లు అనుకోవ‌ద్దు. అది ఎప్ప‌ట్నుంచో చేస్తున్నాడు ఈ హీరో. కానీ ఇక్క‌డ రెండు పడ‌వ‌ల ప్ర‌యాణం అంటే ఒకేసారి రెండు సినిమాలు అని అర్థం.
ఈయనిప్పుడు మూడు సినిమాల‌కు క‌మిట‌య్యాడు. ఇందులో బోయ‌పాటి సినిమాకు ఇంకా టైమ్ ఉంది. కానీ ఎన్టీఆర్ బ‌యోపిక్ మాత్రం ఆగ‌స్ట్ నుంచి సెట్స్ పైకి వెళ్తుంద‌ని.. ద‌స‌రాకు విడుద‌ల చేస్తామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లే అనౌన్స్ చేసారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వినాయ‌క్ సినిమా కూడా లైన్ లోకి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా నిర్మాత సి క‌ళ్యాణ్ జై సింహా 100 రోజుల వేడుక‌లో స్టేజ్ పై అనౌన్స్ చేసాడు.
ఆగ‌స్ట్ నుంచి షూటింగ్ మొద‌లుపెట్టి సంక్రాంతికి సినిమా విడుద‌ల చేస్తామ‌ని చెప్పాడు. వినాయ‌క్ సినిమా ఇప్పుడుంటే మ‌రి ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎప్పుడుంటుంది..? ఒకేసారి రెండు సినిమాలు మొద‌లుపెట్టి పూర్తి చేయ‌డం సాధ్య‌మేనా..? ఈ రెండు సినిమాల‌ను ఒకే టైమ్ లో బాల‌య్య ఎలా బ్యాలెన్స్ చేస్తాడు..? అలా చేస్తే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంది క‌దా..? ఇదే ఇప్పుడు అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న విష‌యం. మ‌రి చూడాలిక‌.. చివ‌రికి బాల‌య్య ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here