బిగ్ బాస్ నుంచి ఆమె ఔట్..


ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా కూడా బిగ్ బాస్ లో ఎలిమినేష‌న్ లీకేజీలు మాత్రం బ‌య‌టికి వ‌స్తూనే ఉన్నాయి. గ‌త వారం శ్యామల ఎలిమినేష‌న్ ముందే తెలిసిపోయింది. అది ఆమె ఫేస్ బుక్ లో పెట్టిందంటూ త‌ర్వాత వార్త‌లొచ్చాయి. అయితే కార‌ణ‌మేదైనా బిగ్ బాస్ 2 లోపాలు మాత్రం ఒక్కొక్క‌టి బ‌య‌ట‌ప‌డుతున్నాయి.
ఇక ఈ వారం కూడా ఎవ‌రు షో నుంచి బ‌య‌టికి వ‌స్తున్నార‌నే విష‌యం రెండు రోజుల ముందే లీక్ అయింది. ఈ వారం టీవీ 9 దీప్తి బ‌య‌టికి వ‌స్తుంద‌ని తెలుస్తుంది. ఇ్ప‌పుడు వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం అంద‌రికంటే ఓట్లు ఆమెకే త‌క్కువ‌గా ఉన్నాయ‌ని వార్త‌లు ప్ర‌చారం జ‌రుగుతుంది.
పైగా శ్యామ‌ల ఎలిమినేష‌న్ త‌ర్వాత దీప్తిలో మున‌ప‌టి జోరు కూడా క‌నిపించ‌డం లేదు. ఇక గ‌ణేష్ ను ఇప్పుడే ఎలిమినేట్ చేస్తే కామ‌న‌ర్స్ ను తొక్కేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు త‌ప్ప‌వు. దానికి తోడు భాను శ్రీ కూడా గేమ్ బాగానే ఆడుతుంది. దాంతో ఈ వారం దీప్తి బ‌య‌టికి వ‌స్తుంద‌నే టాక్ బానే వినిపిస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగబోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here