బిగ్ బాస్ బాగానే వెళ్తుంద‌బ్బా..!

 

కొన్ని సినిమాలు ఉంటాయి.. వాటికి ఫ‌స్ట్ డే టాక్ తో సంబంధం ఉండ‌దు. ల‌క్ క‌లిసొచ్చి బాక్సాఫీస్ ను కుమ్మేస్తుంటాయి. ఇప్పుడు బిగ్ బాస్ షో కూడా అంతే. దీనికి మొద‌టి రోజు డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చింది. తొలి సీజ‌న్ తో పోలిస్తే ఈ సారి పెద్ద బిస్కెట్ అయిపోయింది. అస‌లు ఎవ‌రూ తెలిసిన మొహాలు లేరు.

ఇలాంటి వాళ్ల‌తో షో ఎలా ర‌న్ చేస్తారు అంటూ బాగానే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇలాంటి వాళ్ళ‌తో నాని ఎలా వేగుతాడో ఏంటో అనే వార్త‌లు బాగానే వినిపించాయి. కానీ ఇప్పుడు చూస్తుంటే అంతా సెట్ అయిన‌ట్లే క‌నిపిస్తుంది. ఈ షో పై రోజురోజుకీ ఆస‌క్తి పెరిగిపోతుంది. తెలియ‌ని మొహాలు ఉన్నా కూడా కొత్త కొత్త టాస్క్ లు ఇస్తూ షోపై ఇంట్రెస్ట్ పెంచేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే ప‌ర్లేద‌నే స్థాయిలోనే ఉంది.

అయితే నాని వ‌చ్చిన త‌ర్వాత ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఎపిసోడ్ లోనే నాని క‌నిపించాడు. ఈ వారం వ‌చ్చి త‌న హోస్టింగ్ ఎలా ఉంటుందో చూపించుకోవాలి. మొత్తానికి చూడాలి.. ఇప్ప‌టికి అయింది వారం రోజులే క‌దా.. ఇంకా 15 వారాలు ఉంది. అప్ప‌టి వ‌ర‌కు బిగ్ బాస్ లో ఎన్ని మ‌లుపులు చూడాల్సి వ‌స్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here