బిగ్ బాస్ 2లో తొలి షాక్.. శ్వామ‌ల ఔట్..!


ఇప్ప‌టి వ‌ర‌కు బిగ్ బాస్ సీజ‌న్ 2లో ఎలిమినేష‌న్స్ అన్నీ ఊహించిన‌ట్లుగానే జ‌రుగుతున్నాయి. ఎవ‌రైతే వెళ్లిపోతారు అనుకున్నారో వాళ్లే బ‌య‌టికి వ‌స్తూ ఉన్నారు. తొలివారం సంజ‌న‌.. రెండోవారం నూత‌న్.. మూడోవారం కిరీటి వ‌చ్చారు. ఇప్పుడు నాలుగోవారం మాత్రం ఊహించ‌ని విధంగా శ్యామ‌ల ఎలిమినేట్ అయింది. ఇదే ఇప్పుడు అంద‌రికీ షాక్. షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న యాంక‌ర్ శ్యామ‌లాను నాలుగోవారంలోనే బ‌య‌టికి
పంపేయ‌డం మాత్రం నిజంగా షాకే. పిన్నిగారు అంటూ నాని ఎప్పుడూ ఆట‌ప‌ట్టించే శ్యామల ఇంత స‌డ‌న్ గా బ‌య‌టికి వ‌స్తుంద‌ని ప్రేక్ష‌కులు కూడా అనుకోలేదు. ఆమెతో పాటు నాలుగో వారం దీప్తి న‌ల్ల‌మొత్తు.. నందిని కూడా నామినేష‌న్స్ లో ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన స్పెష‌ల్ ఓట్ ప‌వ‌ర్ తో దీప్తిని తేజ‌స్వి.. నందినిని కౌశ‌ల్ కాపాడారు. దాంతో శ్యామ‌ల బ‌య‌టికి రాక త‌ప్ప‌లేదు. ఏదైనా జ‌ర‌గొచ్చు అని ముందు నుంచి నాని చెబుతూనే ఉన్నాడు.. ప్రేక్ష‌కులే లైట్ తీసుకున్నారు. ఇప్పుడు తొలి షాక్ త‌గిలింది. పైగా వారం వారం ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా మారుతున్నాడు. దాంతో బిగ్ బాస్ హౌజ్ రానురాను మ‌రింత ఆస‌క్తికంగా మారిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here