బిజినెస్ మొద‌లుపెట్టిన రాజ‌మౌళి..

రాజ‌మౌళికి సినిమా త‌ప్ప మ‌రో ధ్యాసే లేదు. ఈయ‌న‌కు సినిమాలే ప్రాణం.. అది త‌ప్ప ఇంకేం తెలియ‌దు అని ఇన్నాళ్లూ అనుకున్నారంతా. కానీ సినిమాతో పాటు త‌న‌కు చాలా తెలుసు అంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆ మ‌ధ్య రాజ‌ధాని నిర్మాణం కోసం చంద్ర‌బాబునాయుడికే ప్లాన్ ఇచ్చి రాజ‌కీయ నాయ‌కుల‌కు కూడా సాయం చేసాడు రాజ‌మౌళి. ఇక ఇప్పుడు ఈయ‌న‌లో బిజినెస్ మ్యాన్ బ‌య‌టికి వ‌స్తున్నాడు.

తాజాగా స్మార్ట్ వాచ్ ల బిజినెస్ లోకి అడుగు పెట్టాడు ద‌ర్శ‌క‌ధీరుడు. క‌న్సూమెక్స్ కంపెనీలో స్నేహితుడు శోభు యార్ల‌గ‌డ్డ‌తో క‌లిసి ఇన్వెస్ట్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆర్నెళ్ల కిందే వీళ్ల పార్ట్ న‌ర్ షిప్ మొద‌లైనా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కంపెనీ నుంచి స్మార్ట్ వాచ్ లు బ‌య‌టికి రాలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రాడ‌క్ట్ ఓకే అయిపోయింది. న‌వంబ‌ర్ నుంచి మార్కెట్ లోకి రాబోతున్నాయి. ఛార్జింగ్ అవ‌సరం లేకుండా ఇవి న‌డ‌వ‌నున్నాయి.

దానికితోడు మ‌న ప‌ల్స్ రేట్.. రోజుకు ఎంత దూరం న‌డిచాం అనే వివ‌రాలు కూడా చెబుతుంది ఈ వాచ్. అన్నింటికీ మించి మేడిన్ ఇండియా కావ‌డం ఇక్క‌డ విశేషం. అందుకే ఏ మాత్రం ఆలోచించ‌కుండా ఇందులో డ‌బ్బు పెట్టేసాడు రాజ‌మౌళి. మ‌రి బిజినెస్ లో ఈయ‌న ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here