బెల్లంకొండ ఆశ ఇప్పట్లో తీరదా..?

SAKHSYAM
ఓ సినిమాకు హీరో మైనస్ అయితే ఆలోచించాలి కానీ కథే మైనస్ అయితే ఏం చేస్తాం చెప్పండి..? ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ విషయంలో ఇదే జరుగుతుంది పాపం. తన తప్పు లేకుండానే ప్రతీ సినిమాకు శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రతీ సినిమాకు ప్రాణం పెడుతున్నా కూడా ఎందుకో కానీ గెలుపు మాత్రం తలుపు తట్టడం లేదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. సాక్ష్యం వసూళ్ల పరంగా దూసుకుపోతున్నా అది ఈయన ఆశ తీరుస్తుందనే నమ్మకం అయితే కనిపించడం లేదు. దానికి కారణం కూడా లేకపోలేదు.
తొలిరోజే ఈ చిత్రం 3.8 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది కుర్ర హీరోల కంటే కూడా ఇది ఎక్కువ వసూళ్లే. నాగచైతన్య, శర్వానంద్ లాంటి హీరోలకు కూడా ఈ స్థాయి ఓపెనింగ్స్ అయితే రావు. కానీ బెల్లంకొండకు మాత్రం ప్రతీ సినిమాకు తొలిరోజే 3 కోట్లకు పైగా ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఈయనకు బి, సి సెంటర్స్ లో అదిరిపోయే ఫాలోయింగ్ ఉందని ఈ వసూళ్ళు చూస్తుంటేనే అర్థమైపోతుంది.
కానీ ఏం చేస్తాం.. సరైన సినిమానే పడటం లేదు. శ్రీవాస్ కూడా సాక్ష్యం సినిమాను కథా పరంగా చూసుకున్నాడు కానీ దాన్ని తెరకెక్కించడంలో మాత్రం విఫలం అయ్యాడు. కథా పరంగా అద్భుతంగా ఉన్న ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళిన తర్వాత మాత్రం ఊహించినట్లుగా రాలేదు. దాంతో ఓపెనింగ్స్ వరకు ఢోకా లేకుండా సాగుతున్న సాక్ష్యం ఫుల్ రన్ లో మాత్రం ఎంత వసూలు చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే అక్షరాలా 25 కోట్లకు పైగా వసూలు చేయాలి. మరి అంత తీసుకొస్తుందా..? బెల్లంకొండ కలలు కంటున్న హిట్ సాక్ష్యంతోనైనా వస్తుందేమో చూడాలిక..? ఇప్పటి వరకు వసూళ్లు అయితే బాగానే వస్తున్నాయి. రెండో రోజు కూడా ఈ చిత్రం దాదాపు 3 కోట్లకు పైగానే వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఇదే దూకుడు మరికొన్ని రోజులు కొనసాగాలని బెల్లంకొండ కనిపించిన ప్రతీ దేవున్ని మొుక్కుకుంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here