బొమ్మరిల్లు లాంటి క్యూట్ లవ్ స్టోరి‘‘ నా లవ్ స్టోరి’’


అశ్వని క్రియేషన్స్ బ్యానర్ పై జి. లక్ష్మి కె. శేషగిరిరావు సంయుక్తంగా మహిధర్ , సోనాక్షి సింగ్ రావత్ లను వెండితెరకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘ నా లవ్ స్టోరీ’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా వున్నది. పెద్ద సినిమాల హోరు ముగిసిన తర్వాత రిలీజ్ చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘బొమ్మరిల్లు’ లాంటి క్యూట్ లవ్ స్టోరి, యూత్ అండ్ ఫ్యామిలీ చూడవలసిన సినిమా‘ నా లవ్ స్టోరి’ అని, హీరో, హీరోయిన్ల్ కొత్తవారైనా సీనియర్స్ కి ధీటుగా బాగా చేశారని, శివన్నారాయణ, తొటపల్లి మధు కామెడీ కడుపుబ్బ నవ్వింస్తుందని, ఇందులోని రెండు సాంగ్స్ నార్త్ బ్యాంకాక్ లోని ‘‘చియాంగ్ మై’’ లో షూట్ చేశామని , తర్వలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి ఆడియోని రిలీజ్ చేస్తామని చెప్పారు.
డైరెక్టర్ మాట్లాడుతూ… కాలేజ్ లో అడుగు పెడుతున్న యూత్ కి, ముఖ్యంగా ఆడపిల్లలకి, కొత్తగాప్రేమలో పడేవాళ్ళకి ఆల్ రెడీ ప్రేమలో ఉన్న వారికి ప్రేమపై క్లారిఫికేషన్ ఇచ్చిన స్టోరి ‘ నాలవ్ స్టోరి’. ‘‘ అష్టాచమ్మా’’, ‘‘ ఉయ్యాలా జంపాలా’’,‘‘పెళ్ళి చూపులు’’ లాంటి నేచురల్ లవ్ స్టోరి అని, కొత్త వాళ్ళైనా బాగా చేశారని, ఈ సినిమా చూసి మీరే చెప్తారు. మా లవ్ స్టోరి చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.
 
నటీ నటులు:
మహిధర్
సోనాక్షిసింగ్ రావత్
శివన్నారయణ
తోటపల్లి మధు
చమ్మక్ చంద్ర
డి.వి
దివ్యశ్రీ గౌడ్
సరిత రెడ్డి
రాకేష్
భూపతి రాజు
 
టెక్నిషియన్స్:
మాటలు: మాల్కారి శ్రీనివాస్
పాటలు: శివశక్తి దత్తా, భువనచంద్ర
డాన్స్: బంగార్రాజు
ఫైట్స్: రామ్ సుంకర
ఎడిటర్: నందమూరి హారి
డి.వో.పి: వేదనివాస్
నిర్మాతలు: లక్ష్మి, కె. శేషగిరిరావు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ గంగాధర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here