బ్ర‌హ్మానందం.. కూర‌లో క‌రివేపాకు..!


అంత పెద్ద క‌మెడియ‌న్ ను పుసుక్కున అంత మాట అనేసారేంటి అనుకుంటున్నారా..? ఇన్నాళ్ళూ బ్ర‌హ్మానందానికి క్రేజ్ లేక‌పోయినా.. ఏదో ఓ సినిమా చేసినా కూడా అందులో ఆయ‌న‌కు మెయిన్ ట్రాక్ ఉండేది. ఆయ‌నే కామెడీని లీడ్ చేసే విధంగా కొద్దో గొప్పో ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ ప‌డేవి. దారుణంగా ఓ మూల‌న ప‌డే జూనియ‌ర్ ఆర్టిస్టు కారెక్ట‌ర్స్ అయితే ఈ మ‌ధ్య కాలంలో ప‌డ‌లేదు ఈ క‌మెడియ‌న్ కు. కానీ తొలిసారి నేల‌టికెట్ లో అలాంటి పాత్ర చేసాడు ఈ కామెడీ కింగ్.
ఒక‌ప్పుడు బ్ర‌హ్మి అయితే ఇలాంటి పాత్ర చేయ‌ను పో అని మొహం మీదే చెప్పేవాడేమో కానీ ఇప్పుడు కాదు. ఈ సినిమా చూసిన త‌ర్వాత బ్ర‌హ్మి ఈ చిత్రంలో ఎందుకున్నాడు..? ఎలా ఒప్పుకున్నాడు ఈ పాత్ర‌..? అనే అనుమానాలు అయితే క‌చ్చితంగా రాక మాన‌వు. మ‌రీ అంత దారుణంగా ఈ సీనియ‌ర్ క‌మెడియ‌న్ ను ట్రీట్ చేసాడు ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ‌. డైలాగులు లేని ఓ పాత్ర ఇచ్చి.. సినిమాలో మ‌ధ్య మ‌ధ్య‌లో అలా చూపిస్తూ బ్ర‌హ్మిని అవ‌మానించినంత ప‌ని చేసాడు.
మ‌రోవైపు ఇప్పుడు బ్ర‌హ్మికి మ‌రో ఆప్షన్ కూడా లేదు కాబ‌ట్టి త‌న‌కు వ‌చ్చిన పాత్ర‌ను చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ మ‌రీ ఇలా ఉండే పాత్ర‌లు చేయ‌క‌పోతేనే మంచిద‌ని ఆయ‌న్ని ఇప్ప‌టికీ అభిమానించే వాళ్లు చెబుతున్న మాట‌. మ‌రి వాళ్ల విన్న‌పం ఈ కామెడీ కింగ్ ప‌ట్టించుకుంటాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here