బ్లాక్ బికినీలో బేబీ అద‌ర‌హో..!

 

బాలీవుడ్ లో కొంద‌రు హీరోయిన్ల‌కు వేరే ప‌నేమీ ఉండ‌దు. ఎప్ప‌టిక‌ప్పుడు వాళ్లు ట్రెండ్ కు త‌గ్గ‌ట్లుగా ఫాలో అయిపోతుంటారు. సినిమాలు ఉన్నా లేక‌పోయినా.. వాళ్లు మాత్రం అందాల‌న్నీ ఆర‌బోస్తుంటారు. ఈ లిస్ట్ లో అంద‌రికంటే ముందొచ్చే ముద్దుగుమ్మ దిశాప‌టాని. ఈ భామ మ‌రోసారి రెచ్చిపోయింది. బ్లాక్ బికినీతో చంపేసింది. అది కూడా ఎక్క‌డో స‌ముద్ర తీరానా కాదు.. రెస్టారెంట్ లో. ముంబైలో త‌న ప్రియుడు టైగ‌ర్ ష్రాఫ్ తో క‌లిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లింది దిశా.
అక్క‌డే స్విమ్మింగ్ ఫూల్ కోసం ఏకంగా బికినీలో ద‌ర్శ‌న‌మిచ్చి అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని వేడెక్కించేసింది. ప్ర‌స్తుతం ఈ భామ‌కు అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. భాగీ 2 త‌ర్వాత దిశాపై స్టార్స్ బాగానే క‌న్నేస్తున్నారు. పైగా ప్రియుడు టైగ‌ర్ ష్రాఫ్ కూడా తోడే ఉన్నాడు క‌దా.. ఆయ‌న సినిమాల్లోనూ న‌టిస్తుంది దిశా. ఇక ఇప్పుడు బ‌య‌ట కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా బికినీలో దిశా ఇచ్చిన పోజు చూసి ఎవ‌రైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
అస‌లే స‌మ్మ‌ర్ లో చెమ‌ట‌లు ప‌డుతుంటే.. ఇప్పుడు రెస్టారెంట్స్ లోనే ఇలా బికినీలు వేస్తే ఈ వేడికి స‌మ్మ‌ర్ హీట్ మ‌రింత పెరిగిపోయింది. ఆ మ‌ధ్య‌ డ‌బూర‌త్నాని కాలెండ‌ర్ కోసం ఏకంగా న్యూడ్ ఫోటోషూట్ చేసిన దిశా.. ఇప్పుడు కాస్త బ‌ట్ట‌లేసుకోవ‌డం నేర్చుకుంది. సూర్యుడికే మంట పుట్టించేలా ఈ భామ రెచ్చిపోతుంటే.. చూస్తూ ఉండ‌టంత‌ప్ప ఇంకేం చేస్తారు చెప్పండి..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here