బ‌న్నీ ఒక‌టి కాదు రెండు..


ఖాళీగా ఉంటే ఖాళీగా ఉన్నాడంటారు.. సినిమాలు చేస్తుంటే వ‌ర‌స‌గా ఖాళీ లేకుండా చేస్తున్నారంటారు.. ఎలా చ‌చ్చేది ఈ అభిమానుల‌తో అంటున్నాడు బ‌న్నీ ఇప్పుడు. ఈయ‌న కొన్ని రోజులుగా ఎలాంటి సినిమాలు లేకుండా ఖాళీగానే ఉన్నాడు. పూర్తిగా అన్ని టెన్ష‌న్స్ వ‌దిలేసి త‌న ప‌ని తాను చేసుకుంటూ పిల్ల‌లతో ఆడుకుంటున్నాడు. ఈ గ్యాప్ లోనే రెండు మూడు క‌థ‌లు కూడా విన్నాడు.
ఇక ఇప్పుడు వీటికి ముహూర్తం పెట్ట‌డానికి రెడీ అయ్యాడు బ‌న్నీ. ఒక‌టి కాదు రెండు సినిమాల‌తో వ‌స్తున్నాడు అల్లు వార‌బ్బాయి. ఇందులో విక్ర‌మ్ కే కుమార్ సినిమాలో ముందుగా న‌టించ‌బోతున్నాడు బ‌న్నీ. ఈ చిత్రం 100 కోట్ల బ‌డ్జెట్ తో రూపొంద‌నుంద‌ని.. రేసుగుర్రం నిర్మాత న‌ల్ల‌మ‌లుపు బుజ్జి నిర్మించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. అయితే విక్ర‌మ్ చేసిన ప్ర‌యోగాల‌కు ఇప్ప‌టికే హ‌లోతో నాగార్జున‌.. 24తో సూర్య బ‌లైపోయారు. కానీ మంచి పేరు వ‌చ్చింది. క‌మ‌ర్షియ‌ల్ గా డ‌బ్బులు మాత్రం రాలేదు.
మ‌రిప్పుడు బ‌న్నీతో క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేస్తున్నాడా లేదంటే మ‌ళ్లీ ప్ర‌యోగ‌మే చేస్తాడా అనేది మాత్రం ఇప్పటికి స‌స్పెన్స్. ఇదిలా ఉంటే ఈ చిత్రంతో పాటే త్రివిక్ర‌మ్ సినిమా కూడా చేయ‌బోతున్నాడు బ‌న్నీ. ఈ చిత్రాన్ని డివివి దాన‌య్య నిర్మించ‌నున్నాడు. ఈ రెండు సినిమాలు వ‌చ్చే రెండేళ్ల‌లో తెర‌కెక్క‌నున్నాయి. నా పేరు సూర్యతో ఫ్లాప్ ఇచ్చిన బ‌న్నీకి క‌చ్చితంగా హిట్ కొట్ట‌డం ఇప్పుడు అవ‌స‌రం. మ‌రి ఈ లోటు తీర్చే ద‌ర్శ‌కుడు ఎవ‌రో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here