బ‌న్నీ కూడా వాళ్ల‌ను ఏకేసాడుగా..!


మెగా ఫ్యామిలీ అంతా ఇప్పుడు ఒకే ప‌నిమీద ఉన్నారు. బ‌య‌టకు వ‌స్తే చాలు ఛానెల్స్ ను ఎక్క‌డమే పనిగా పెట్టుకున్నారు. ఇప్ప‌టికీ ప‌వ‌ర్ స్టార్ ఇదే ప‌నిమీదున్నాడు. త‌నను కావాల‌ని తిట్టించిన ఛానెల్స్ ను చూడొద్దంటూ బాయ్ కాట్ చేయాలంటూ అభిమానుల‌ను కోరుతున్నాడు.
ఇప్పుడు బ‌న్నీ కూడా ఇదే చేసాడు. తాజాగా నా పేరు సూర్య ఆడియో వేడుక మిల‌ట్రీ మాధ‌వ‌రంలో జ‌రిగింది. అక్క‌డ అభిమానుల‌ను ఉద్దేశించి మాట్లాడుతు ప‌వ‌న్ టాపిక్ కూడా తీసాడు బ‌న్నీ. ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి మాట్లాడ‌ని అల్లువార‌బ్బాయి.. ఇప్పుడు మాత్రం మ‌న‌సులో ఉన్న భార‌మంతా దించేసుకున్నాడు. ఈ మ‌ధ్య ఎవ‌డు ప‌డితే వాడు.. మైక్ లు ప‌ట్టుకుని ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడేస్తున్నాడు.
ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి కూడా ఇలాగే చేస్తున్నారు. అప్ప‌ట్లో చిరు రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌పుడే ఇలాంటి విమ‌ర్శ‌ల‌న్నీ విని చెవులు కూడా అల‌వాటు ప‌డి పోయాయి. కానీ మొన్న మాట్లాడిన మాట మాత్రం చాలా త‌ప్పు.. త‌నకు అది న‌చ్చ‌లేద‌ని చెప్పాడు బ‌న్నీ. అది మాట్లాడిన వాడు.. మాట్లాడించిన వాడు.. ముఖ్యంగా మాట్లాడిన త‌ర్వాత ల‌క్ష‌లాది మందికి ప‌దే ప‌దే చూపించిన వాడు అంద‌రికీ త‌ప్పే.
ఏం చేస్తాం ఛానెల్స్ ఉన్నాయి క‌దా.. మ‌న ఖ‌ర్మ అంటూ సెటైర్లు వేసాడు బ‌న్నీ. కానీ అలా చేయ‌డం మాత్రం చాలా త‌ప్ప‌ని.. దానికి ప్ర‌జ‌లే బుద్ధి చెప్తార‌ని చెప్పాడు బ‌న్నీ. మొత్తానికి బ‌న్నీ కూడా ఛానెల్స్ ను బాగానే ఏకి పారేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here