బ‌న్నీ వెంట ప‌డుతున్న మీడియా.. 

Naa Peru Surya Naa Illu India First Impact Teaser
అవునా.. బ‌న్నీ వెంట మీడియా ఎందుకు ప‌డుతుంది.. అయినా ఆయ‌న ఇప్పుడు ఎక్క‌డో శ్రీ‌న‌గ‌ర్ లో క‌దా ఉన్నాడు.. అక్క‌డికి వెళ్లి మ‌రీ మీడియా వెంట ప‌డుతుందా అనుకుంటున్నారా..? అవును.. నిజంగానే ఇప్పుడు బ‌న్నీకి మీడియాతో చాలా ప‌నులు ఉన్నాయి. అయితే అది రియ‌ల్ లైఫ్ కోసం కాదు.. రీల్ లైఫ్ కోసం. ఈయ‌న ప్ర‌స్తుతం న‌టిస్తున్న నా పేరు సూర్య షూటింగ్ శ్రీ‌న‌గ‌ర్.. జ‌మ్మూకాశ్మీర్ ప్రాంతాల్లో భీక‌ర‌మైన చ‌లిలో జ‌రుగు తుంది. అక్క‌డే మరో రెండు రోజుల షూటింగ్ త‌ర్వాత హైద‌రాబాద్ రానున్నారు చిత్ర‌యూనిట్. వ‌చ్చీ రాగానే అల్లుఅర్జున్ పై మీడియా ఫోక‌స్ అంతా షిఫ్ట్ కానుంది. దానికి కార‌ణం నా పేరు సూర్య సినిమా క్లైమాక్స్. శంషాబాద్ లో ఫిబ్ర‌వ‌రి 12 నుంచి 15 వ‌ర‌కు క్లైమాక్స్ షెడ్యూల్ జ‌ర‌గ‌బోతుంది. ఇందులో మీడియా కీల‌క‌పాత్ర పోషించ‌నుంది. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ భారీగా ప్లాన్ చేస్తున్నాడు.
నా పేరు సూర్య క‌చ్చితంగా అల్లు అర్జున్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోతుందంటున్నాడు బ‌న్నీవాస్. వ‌క్కంతం వంశీ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారుతున్నాడు. ఇందులో కోపం ఎక్కువ‌గా ఉండే సైనికుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు బ‌న్నీ. ఇది ఆంటోనీ ఫిష‌ర్ అనే హాలీవుడ్ సినిమాకు రీమేక్ అనే వార్త‌లు వ‌స్తున్నాయి కానీ చిత్ర యూనిట్ మాత్రం ఇందులో నిజం లేద‌ని తేల్చేసింది. మ‌రి చూడాలిక‌.. ఎప్రిల్ 27న రానున్న నా పేరు సూర్య ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర‌తీస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here