భాగ‌మ‌తి ఏం చేయ‌బోతుందో..? 

 Anushka is showing her star stamina!
భాగ‌మ‌తి.. అనుష్క అభిమానుల‌కు ఇప్పుడు ఈ పేరు తార‌క‌మంత్రం. ఆమె సినిమాలు ఒప్పుకోక చాలా కాల‌మే అవుతుంది. అస‌లు అనుష్క ఎక్క‌డుందో కూడా ఇప్పుడు ఎవ‌రికీ తెలియ‌దు. అంత సీక్రెసీ మెయింటేన్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇలాంటి టైమ్ లో అనుష్క నుంచి వ‌స్తున్న సినిమా భాగ‌మ‌తి. ఈ చిత్రంపై ముందు ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాల్లేవు.. ఆస‌క్తి కూడా క‌నిపించ‌లేదు. కానీ మొన్న ఫ‌స్ట్ లుక్ విడుద‌లైన త‌ర్వాత క‌చ్చితంగా ఈ చిత్రంపై అంచ‌నాలు పెరిగిపోయాయి. ఏదో చేస్తుంద‌నే ఆస‌క్తి కూడా వ‌చ్చేసింది. కొన్నిసార్లు కొన్ని సినిమాల‌ను తెలియ‌కుండానే త‌క్కువ అంచ‌నా వేస్తుంటారు. కానీ ఆ సినిమాలే మిగిలిన వాళ్ల‌ను బోల్తా కొట్టిస్తుంటాయి. అప్ప‌ట్లో అరుంధ‌తి సినిమాను అలా త‌క్కువంచ‌నా వేసి చాలా మంది హీరోలు బోల్తా కొట్టారు. ఇప్పుడు మ‌ళ్లీ అనుష్క అలాంటి సినిమాతో వ‌స్తుంది. అదే భాగ‌మ‌తి.
ఈ చిత్రంపై ముందు నుంచి ఆస‌క్తి ఉంది కానీ ఆల‌స్యం అవుతున్న కొద్దీ అంచ‌నాలు త‌గ్గిపోయాయి. అశోక్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తైపోయి చాలా కాల‌మైంది. ఫ‌స్ట్ లుక్ లో శిలువ వేసుకుని ఉన్న‌ట్లు క‌నిపిస్తున్న అనుష్క‌.. చేతిలో సుత్తి.. ర‌క్తం ఇవ‌న్నీ చూస్తుంటే భాగ‌మ‌తి ప‌క్కా యాక్ష‌న్ ఓరియెంటెడ్ అనిపిస్తుంది. క‌థ‌పై న‌మ్మ‌కంతో యువీ క్రియేష‌న్స్ ఏకంగా 25 కోట్ల‌పైనే పెట్టారు. ఈ బ‌డ్జెట్ కవ‌ర్ చేయ‌డానికి తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లోనూ భాగ‌మ‌తిని విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌భాస్ కూడా ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ కు వ‌స్తాడ‌ని తెలుస్తోంది. ఇటు అనుష్క‌.. అటు యువీతో ప్ర‌భాస్ ను మంచి అనుబంధం ఉంది. దాంతో ఈయ‌న కూడా వ‌చ్చేలా క‌నిపిస్తున్నాడు. టీజ‌ర్ డిసెంబ‌ర్ 20.. ఉ. 10.45 నిమిషాల‌కు విడుద‌ల కానుంది. సినిమా జ‌న‌వ‌రి 26న విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here