భాగ‌మ‌తి లెక్క‌లు బాగున్నాయి..

Anushka is showing her star stamina!
లేడీ ఓరియెంటెడ్ సినిమానే క‌దా.. హీరో లేని సినిమానే క‌దా.. ఎవ‌రు చూస్తారులే అని లైట్ తీసుకుంటే తాట తీస్తానంటోంది అనుష్క‌. నిజంగా కాదులెండి.. యూ ట్యూబ్ లో. ఈమె న‌టించిన భాగ‌మ‌తి ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ చిత్రంపై ఇంత‌గా ఆస‌క్తి ఉంద‌ని ఇప్పుడు ట్రైల‌ర్ కు వ‌స్తోన్న రెస్పాన్స్ చూసే వ‌ర‌కు తెలియ‌దు. ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైన ఆరు గంట‌ల్లోనే 10 ల‌క్ష‌ల‌వ్యూస్ దాటేసింది. ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు ఇది చాలా ఎక్కువ‌. 20 గంట‌ల్లోనే భాగ‌మ‌తి ట్రైల‌ర్ ఖాతాలో 32 ల‌క్ష‌ల హిట్స్ ప‌డ్డాయి. ఈ లెక్క చూస్తుంటే నిజంగానే భాగ‌మ‌తి అంద‌రి లెక్క‌లు సెట్ చేసేలా క‌నిపిస్తుంది. జ‌న‌వ‌రి 26న అనుష్క‌తో ఎవ‌రెవ‌రు పోటీ ప‌డ‌బోతున్నారో కానీ అంద‌రి లెక్క‌లు తేల‌డం అయితే ఖాయం. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత సినిమాను త‌క్కువగా అంచ‌నా మాత్రం వేయ‌లేం.
సాప్ట్ గా ఉండే అమ్మాయి పాత్ర‌లో అనుష్క ఎంట్రీ ఇవ్వడం.. ఊరి కోసం మంచి చేయడం.. ఆ త‌ర్వాత వెంట‌నే జైలుకు వెళ్ల‌డం.. అక్క‌డ్నుంచి పాతబంగ్లాలో బంధించడం.. అక్కడ ఓ అదృశ్యశక్తి అనుష్కను వెంటాడటం.. ఇవ‌న్నీ ఆస‌క్తి పుట్టించాయి. చివ‌ర్లో ఎవరు పడితే వారు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా. లెక్కలు తేలాలి.. ఒక్కడ్నీ పోనివ్వనంటూ అనుష్క పలికిన డైలాగులు కేక పెట్టించాయి. ముఖ్యంగా ఆ గెట‌ప్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది. మ‌రోసారి అరుంధ‌తి త‌ర‌హాలోనే రెచ్చిపోయింది అనుష్క‌. పిల్ల జ‌మీందార్ త‌ర్వాత హిట్ లేని అశోక్ భాగ‌మ‌తిని ఏ విధంగా తెర‌కెక్కించి ఉంటాడో అనే ఆస‌క్తి మొద‌లైంది. దానికితోడు ఈయ‌న గ‌త సినిమా చిత్రాంగ‌ధ కూడా దెయ్యం సినిమానే. మ‌రోసారి అలాంటి కాన్సెప్ట్ తోనే వ‌స్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌రి ఈ సారి ఏం మాయ చేసుంటాడో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here