భార్యను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరో!

 

శివ బాలాజీ ఈ మధ్య వార్తల్లో బాగానే నిలుస్తున్నారు. కాటంరాయుడు చిత్రంలో పవన్ కళ్యాణ్ తమ్ముడు గా కనిపించిన ఆయన సామజిక మాధ్యమం పై యుద్ధం ప్రకటించారు. కొందరు పవర్ స్టార్ ను పేస్ బుక్ చాటున దూషించారని ఆ మధ్య సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు శివ బాలాజీ. ఇటీవలే ఎన్టీఆర్ నిర్వహించిన బిగ్ బాస్ షో లో విన్నర్ గా నిలిచాడు కూడా. తాజాగా శివ బాలాజీ మళ్ళి పోలీసులను ఆశ్రయించారు. తన భార్య మధుమితను ఆగంతకులు పేస్ బుక్ లో వేధిస్తున్నారని ఫిర్యాదు చేసాడు బాలాజీ. కొందరు ఆమె ఫేస్బుక్ అకౌంట్ లో అభ్యంతరకర పదజాలం తో కామెంట్లు పెడుతున్నారని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కు కంప్లైంట్ చేసాడు. ఐ.టి. ఆక్ట్ కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సైబరాబాద్ డి.సి.పి జానకి శర్మ చెప్పారు. ఐ.పి. అడ్రస్ ట్రాక్ చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చినట్లు సమాచారం.