భార్య‌కు పోటీగా చైతూ చైత‌న్యం..!


భార్య‌లు స‌క్సెస్ అయితే ఓకే.. మ‌రీ ఎక్కువ స‌క్సెస్ అయితే మాత్రం కుళ్ల‌కుంటారా అంటూ మ‌హాన‌టిలో స‌మంతతో ఓ డైలాగ్ చెప్పించాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. ఇప్పుడు నిజ‌జీవితంలోనూ స‌మంత‌కు ఇదే జ‌రుగుతుంది. భ‌ర్త నాగ‌చైత‌న్య కంటే ఇమేజ్ లో చాలా ముందుంది స‌మంత‌. ఈమెకు ఉన్న క్రేజ్ కంటే చైతూ మార్కెట్ కానీ.. క్రేజ్ కానీ త‌క్కువే. అందుకే ఇప్పుడు భార్య‌కు పోటీగా పోటెత్తుతున్నాడు నాగ‌చైత‌న్య‌.
ఆమెతో స‌మాన‌త్వం కోసం వ‌ర‌స‌ సినిమాలు చేస్తున్నాడు. స‌మ్మ‌ర్ లో మూడు బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందుకుంది స‌మంత‌. రంగ‌స్థ‌లం.. మ‌హాన‌టి.. ఇరుంబుతిరైతో దూసుకెళ్తుంది స‌మంత కెరీర్. మ‌రోవైపు నాగ‌చైత‌న్య మాత్రం యుద్ధం శ‌ర‌ణం ఫ్లాప్ తో వెన‌క‌బ‌డిపోయాడు. ప్ర‌స్తుతం చందూమొండేటితో స‌వ్య‌సాచితో బిజీగా ఉన్నాడు చైతూ. ఈ చిత్ర షూటింగ్ మొన్న‌టి వ‌ర‌కు న్యూయార్క్ లో జ‌రిగింది. జులైలో స‌వ్య‌సాచి విడుద‌ల కానుంది. ఇందులో హీరో రెండు చేతుల‌కు ఒకే ర‌క‌మైన బ‌లం ఉంటుంది.. పైగా ఎడ‌మ‌చేయితో బాడీకి క‌నెక్ష‌న్ ఉండ‌దు.
ఇదే సినిమాకు హైలైట్. ఇక ఈ చిత్రంతో పాటు మారుతి శైల‌జారెడ్డి అల్లుడు సినిమా షూటింగ్ మే 18 నుంచి మొద‌లు పెట్ట‌నున్నాడు నాగ‌చైత‌న్య‌. ఈ చిత్రం త‌ర్వాత మ‌రో రెండు సినిమాల‌కు కూడా క‌మిట‌య్యాడు చైతూ. మొత్తానికి భార్య‌కు పోటీ ఇవ్వ‌డానికి వ‌రస‌ సినిమాల‌తో వ‌చ్చేస్తున్నాడు అక్కినేని వార‌సుడు. మ‌రి చూడాలిక‌.. చివ‌రి వ‌ర‌కు భార్య ఇమేజ్ ను ఈ భ‌ర్త అందుకుంటాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here