భాస్క‌ర్.. సైలెంట్ గా చేస్తున్నాడుగా..


త‌రుణ్ భాస్క‌ర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదేమో..? ఒకే ఒక్క సినిమాతో ఇండ‌స్ట్రీ మొత్తాన్ని త‌న‌వైపు తిప్పుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అదే పెళ్లిచూపులు. నేష‌న‌ల్ వైడ్ గా కూడా ఈ చిత్రం పాపుల‌ర్ అయింది. హిందీతో పాటు త‌మిళ్ లో కూడా రీమేక్ అవుతుంది మ‌న పెళ్లిచూపులు. అంతే కాదు.. రెండు జాతీయ అవార్డులు కూడా వ‌చ్చాయి ఈ చిత్రానికి. ఇంత‌టి సంచ‌ల‌నం త‌ర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నాడు త‌రుణ్ భాస్క‌ర్. ఈ మ‌ధ్యే ఈయ‌న రెండో సినిమా మొద‌లుపెట్టాడు. అస‌లు ఏ మాత్రం చ‌డీ చ‌ప్పుడు లేకుండా రెండో సినిమాను ప‌ట్టాలెక్కించాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే కొంద‌రు నిర్మాత‌లు అడ్వాన్సుల‌తో త‌రుణ్ కు ఆఫ‌ర్ ఇస్తున్నారు. కానీ మ‌నోడు మాత్రం దేనికి టెమ్ట్ అవ్వ‌ట్లేదు. తొలి సినిమాతో త‌న‌కు లైఫ్ ఇచ్చిన సురేష్ బాబు నిర్మాణంలోనే రెండో సినిమా కూడా చేస్తున్నాడు త‌రుణ్ భాస్క‌ర్. దిల్ చాహ‌తా హై త‌ర‌హాలో ఓ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త‌వాళ్ల‌తోనే రెండో సినిమా కూడా చేస్తున్నాడు త‌రుణ్. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం విడుద‌ల కానుంది. మ‌రి పెళ్లిచూపులుతో సంచ‌ల‌నం సృష్టించిన ఈ కుర్ర ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు రెండో సినిమాతో ఎలాంటి సంచ‌ల‌నానికి తెర తీయ‌నున్నాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here