భ‌క్తి మార్గం ప‌ట్టిన ర‌కుల్ ప్రీత్ సింగ్.. 

అవును.. కాస్త ఆలోచించి చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది. అంత మోడ్ర‌న్ గా క‌నిపించే ర‌కుల్ కూడా భ‌క్తురాలే. ఆమెకు కూడా ఆధ్యాత్మిక‌పై న‌మ్మ‌కం ఉంది. టాలీవుడ్ లో ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న ఈ దారిలోనే వెళ్తున్నారు. స‌ద్గురు విష‌యంలో మెగా ఫ్యామిలీ అంతా ఒకే దారిలోనే వెళ్తున్నారు. ఆ మ‌ధ్య ఆయ‌న్ని ఇంటికి పిలిపించుకుని మ‌రీ ఆయ‌న సూక్తులు విన్నారు. ఇప్పుడు ర‌కుల్ కూడా ఇదే చేస్తుంది. ఈమెకు సినిమా..  జిమ్ తో పాటు ఆద్యాత్మిక చింత‌న కూడా ఎక్కువే. ఆమెను చూస్తుంటే అలా అనిపించ‌దు కానీ దేవున్ని న‌మ్మ‌డం.. ఆద్యాత్మిక విష‌యాలు తెలుసుకోవ‌డంపై ర‌కుల్ బాగానే దృష్టి పెడుతుంది. ఇందులో భాగంగానే ఈ మ‌ధ్యే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ఆనందపురం మండ‌లంలో జ‌రిగిన ఇషా గ్రామో త్సవానికి హాజ‌రైంది ర‌కుల్. ఈ కార్య‌క్ర‌మానికి స‌ద్గురు కూడా వ‌చ్చాడు.
అక్క‌డే ఇంట‌ర్ విలేజ్ స్పోర్ట్స్ టోర్న‌మెంట్ కూడా జ‌రిగింది. ఎన్నో గ్రామాల‌ను ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చి.. వాళ్ల మ‌ధ్య బంధాల‌ను ఇంకా ధృడంగా మార్చ‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ్రామోత్స‌వం కార్య‌క్ర‌మానికి పూనుకుంది. ఇందులో భాగంగానే గ్రామాల మ‌ధ్య ఆట‌లు, సంగీతం పోటీలు నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో ర‌కుల్ తో పాటు స‌ద్గురు కూడా ఒకే వేదిక పంచుకున్నారు. స‌ద్గురు సేవ‌లో ఈ మ‌ధ్యే రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న కూడా పాల్గొన్నారు. చిరంజీవి ఇంటికే స‌ద్గురు వ‌చ్చారు. అంతేకాదు.. ఈయ‌న ప్ర‌వ‌చ‌నాల‌ను నిత్యం వింటూనే ఉంటారు మెగా జంట‌. ఇప్పుడు ర‌కుల్ కూడా ఇదే చేస్తుంది. స‌ద్గురు చెప్పే వాక్యాలను వింటుంది. మొత్తానికి ర‌కుల్ ఆద్యాత్మిక చింత‌న‌లోకి వెళ్లిపోతుంద‌న్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here