భ‌ర‌త్.. నీ దూకుడు సాటెవ్వ‌డూ..!


ఒక‌ప్పుడు మ‌హేశ్ కోసం రాసిన పాటే ఇది. ఇప్పుడు మ‌రోసారి ప‌నికొస్తుంది. ఇప్పుడు ఈయ‌న దూకుడు ముందు బాక్సాఫీస్ బ‌ద్ద‌లైపోయి అలా చూస్తుండిపోతుంది. భ‌ర‌త్ అనే నేను నిర్ధాక్ష‌ణ్యంగా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తుంది. ఈ చిత్రం కేవ‌లం రెండున్న‌ర రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి బాలీవుడ్ కు కూడా స‌వాల్ విసిరింది. తొలిరోజే 55 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా 28 కోట్ల వ‌ర‌కు గ్రాస్ వ‌సూలు చేసింద‌ని తెలుస్తుంది.
ఇక మూడో రోజు కూడా అదే సంచ‌ల‌న వ‌సూళ్లు వ‌స్తుండ‌టంతో రెండున్న‌ర రోజుల్లోనే సెంచ‌రీ దాటేసాడు సూప‌ర్ స్టార్. ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీ‌మంతుడు రికార్డులే మ‌హేశ్ కు అత్య‌ధికం. ఇప్పుడు మ‌రోసారి కొర‌టాలే ఈ రికార్డుల‌ను బ‌ద్ధ‌లు కొడుతున్నాడు. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో చిరంజీవి ఖైదీ నెం.150 ఐదు రోజుల్లో.. రంగ‌స్థ‌లం నాలుగు రోజుల్లో 100 కోట్ల మార్క్ అందుకున్నాయి. ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను ఏకంగా మూడు రోజుల కంటే త‌క్కువ టైమ్ లోనే 100 కోట్ల మార్క్ అందుకుంది.
నిర్మాత‌లు కూడా అఫీషియ‌ల్ గా పోస్ట‌ర్ విడుద‌ల చేసారు. ఈ చిత్ర జోరు చూస్తుంటే ఫుల్ ర‌న్ లో ఈజీగా రంగ‌స్థ‌లం రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేలా ఉన్నాడు. రంగ‌స్థ‌లం 110 కోట్ల షేర్ వ‌సూలు చేసి నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను త‌న పేర రాసుకున్నాడు. ఓవ‌ర్సీస్ లో కూడా రెండు రోజుల్లోనే 2 మిలియ‌న్ మార్క్ కు చేరువైంది ఈ చిత్రం. మొత్తానికి బ్ర‌హ్మోత్స‌వం.. స్పైడ‌ర్ లాంటి డిజాస్ట‌ర్స్ త‌ర్వాత మ‌హేశ్ కు రికార్డ్ బ్రేకింగ్ హిట్ వ‌చ్చింది. దాంతో అటు ఫ్యాన్స్.. ఇటు సూప‌ర్ స్టార్ పండ‌గ చేసుకుంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here