భ‌ర‌త్.. ప్రామిస్ గ‌ట్టిగానే చేసాడు..!

Bharat Ane Nenu
ఒక్క‌సారి ప్రామిస్ చేసి త‌ప్పితే అత‌న్ని మ్యాన్ అన‌రంటూ టీజ‌ర్ లోనే తానేం చెప్పాల‌నుకున్నాడో చెప్పాడు కొర‌టాల శివ‌. ఇప్పుడు సినిమా కూడా వ‌చ్చేసింది. అస‌లే శ్రీ‌మంతుడు కాంబినేష‌న్.. పైగా పొలిటిక‌ల్ మూవీ కూడా కావ‌డంతో అంచ‌నాలు ఆకాశంలో ఉన్నాయి. దానికి త‌గ్గ‌ట్లే భారీ స్థాయిలో భ‌ర‌త్ అనే నేను విడుద‌లైంది.
తొలిరోజే ఈ చిత్రానికి టాక్ బాగా వ‌చ్చింది. శ్రీ‌మంతుడు రేంజ్ లో లేద‌ని కొంద‌రు పెద‌వి విరుస్తున్నా.. కొర‌టాల చేసిన ఓ సిన్సియ‌ర్ అటెంప్ట్ కు మాత్రం ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. తాను అనుకున్న క‌థ కోసం ఎక్క‌డా ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా ఈయ‌న చేసిన ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కులు నీరాజ‌నాలు ప‌డుతున్నారు.
ఇప్పుడు ఉన్న టాక్ కంటిన్యూ అయినా కూడా భ‌ర‌త్ రికార్డులు తిర‌గ‌రాయ‌డానికి. పైగా ముఖ్య‌మంత్రిగా మ‌హేశ్ ర‌ప్ఫాడించేసాడు. ఇన్ని పాజిటివ్స్ ముందు సినిమా స్లోగా ఉంది.. కామెడీ లేదు.. రొటీన్ స్టోరీ అనే చిన్న చిన్న మైన‌స్ లు క‌నిపించ‌ట్లేదు. క‌చ్చితంగా భ‌ర‌త్ దూకుడు ముందు యుఎస్ రికార్డులైతే బ‌ద్ధలు కాక త‌ప్ప‌దు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ భ‌ర‌త్ దూకుడు మామూలుగా లేదు. ఇదంతా చూస్తుంటే మ‌హేశ్-కొర‌టాల మ‌రోసారి గ‌ట్టిగానే ప్రామిస్ చేసిన‌ట్లు క‌నిపిస్తున్నారు. చూడాలిక‌.. భ‌ర‌త్ జ‌ర్నీ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here