భ‌లే మంచి రోజు..

CHARAN NAGA CHAITANYA MOVIES OPENING
తెలుగు ఇండ‌స్ట్రీలో జ‌న‌వ‌రి 19 చాలా మంచి రోజు ఉన్న‌ట్లుంది. ఒకేరోజు రెండు సినిమాలు ఓపెన్ అయ్యాయి. ఎప్ప‌ట్నుంచో వార్త‌ల్లో ఉన్న రామ్ చ‌ర‌ణ్, బోయ‌పాటి సినిమా జ‌న‌వ‌రి 19నే  మొద‌లైంది. తొలి షెడ్యూల్ హైద‌రాబాద్ లోనే జ‌ర‌గ‌బోతుంది. అయితే ఈ షెడ్యూల్ లో చ‌ర‌ణ్ మాత్రం ఉండ‌ట్లేదు. వ‌చ్చాడు.. ఓపెనింగ్ షాట్ లో ఉన్నాడు.. ముహూర్తం పెట్ట‌గానే మ‌ళ్లీ రంగ‌స్థ‌లానికి వెళ్లిపోయాడు చ‌ర‌ణ్. రాజ‌మండ్రిలో ఈయ‌న షూటింగ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు. రంగ‌స్థ‌లం ఫైన‌ల్ షెడ్యూల్ అక్క‌డే జ‌రుగుతుంది. ఈ చిత్రం ఇదే నెల‌లో పూర్తి కానుంది. ఇది అయిపోయిన వెంట‌నే రాజ‌స్థాన్ లో రెండో షెడ్యూల్ కు జాయిన్ కానున్నాడు మెగా వార‌సుడు. అక్క‌డే భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు బోయ‌పాటి శీను. ఈ షెడ్యూల్ లోనే చ‌ర‌ణ్ పై కీల‌క‌మైన స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నాడు శీను బోయ‌పాటి. ఇక ఈ చిత్రంలో కైరా అద్వాని హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇక ఈ చిత్రంతో పాటే నాగ‌చైత‌న్య హీరోగా మారుతి తెర‌కెక్కించ‌బోయే సినిమా ఓపెనింగ్ కూడా జ‌రిగింది. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. ఇందులో అను ఎమ్మాన్యువ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తుంది. శైల‌జారెడ్డి అల్లుడు అనే వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇందులో అత్త‌గా ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుంది. అల్ల‌రి అల్లుడు రీమేక్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి జ‌న‌వ‌రి 19 తెలుగు ఇండ‌స్ట్రీకి భ‌లే మంచి రోజు అయింది. మ‌రి ఈ రెండు సినిమాలు ఎలా ఉండ‌బోతున్నాయో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here