మంచు మనోజ్ “ఒక్కడు మిగిలాడు”కి నారా రోహిత్ వాయిస్ ఓవర్

Manoj didn’t Leave Naraa Rohith also for Okkadu Migiladu
అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా  ప‌ద్మ‌జ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యాన‌ర్‌ఫై రూపొందుతున్న చిత్రం `ఒక్క‌డు మిగిలాడు`.  ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి యువ కథానాయకుడు నారా రోహిత్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.
నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. “ఎన్నో అవాంతరాలను దాటుకొని నవంబర్ 10న మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మనోజ్ కోరిక మేరకు నారా రోహిత్ గారు మా చిత్రానికి వాయిస్ ఓవర్ అందించడం సంతోషంగా ఉంది. సినిమా ఓపెనింగ్ లో వచ్చే నారా రోహిత్ వాయిస్ ఓవర్ సినిమాలోకి ఆడియన్స్ ను ఇన్వాల్వ్ చేస్తుంది. ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించి.. అంతే స్థాయిలో కష్టపడి సినిమాని విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి మా కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం” అన్నారు.
మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: పి.ఎస్.వర్మ, సినిమాటోగ్రాఫర్: వి.కోదండ రామరాజు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్క్రీన్ ప్లే: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ, నిర్మాత: ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్, దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతక్కి.