మరో వివాదానికి తెర తీసిన కమల్ హాసన్

Kamal Haasan controversial comments on Hindu terrorism

 

రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న కమల్ హాసన్ గత కొంత కాలంగా తరచు వార్తల్లో ఉంటున్నారు. తమిళ్ నాడు ప్రభుత్వం డెంగ్యూ జ్వరాలను అరికట్టే దిశగా నిలవెంబు కుడినీర్ అనే ఆయుర్వేద మందును పంపిణి చేయగా, కమల్ ఆ పధకాన్ని కించపరుస్తూ ట్వీట్ చేయడం తో క్రిమినల్ కేసు నమోదు అయ్యింది.

కోర్ట్ ఆ కేసులో కమల్ కు ఊరటనిచ్చింది. తాజాగా కమల్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కులో పడ్డారు. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందని, దానిని తక్షణమే నిరోధించక పోతే ప్రమాదమని కమల్ అనడం చర్చనీయాంశమయ్యింది. కమల్ నాస్తికుడు, ఇదివరకు అయన మహాభారతం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కులో పద్దరుకూడా.