మస్కట్‌లో సాయిధరమ్‌తేజ్‌, వి.వి.వినాయక్‌, సి.కళ్యాణ్‌ చిత్రం పాటలు

sai dharam tej, vv vinayak, c kalyan in maskat for film shooting
మస్కట్‌లో సాయిధరమ్‌తేజ్‌, వి.వి.వినాయక్‌, సి.కళ్యాణ్‌ చిత్రం పాటలు
సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలను మస్కట్‌లో చిత్రీకరించనున్నారు.
ఫిబ్రవరి 9న వరల్డ్‌వైడ్‌ రిలీజ్‌
ఈ షెడ్యూల్‌ గురించి నిర్మాత సి.కల్యాన్‌ తెలియజేస్తూ ”డిసెంబర్‌ 18 నుంచి 28 వరకు మస్కట్‌లో రెండు పాటల్ని జానీ మాస్టర్‌, శేఖర్‌ మాస్టర్‌ నేతృత్వంలో చిత్రీకరించబోతున్నాం. దీంతో క్లైమాక్స్‌ మినహా షూటింగ్‌ పూర్తవుతుంది. మస్కట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకొని ఇండియా వచ్చిన వెంటనే క్లైమాక్స్‌ని భారీ ఎత్తు చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేశాం. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రం టైటిల్‌ని త్వరలోనే ప్రకటిస్తాం” అన్నారు.
సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, వినీత్‌కుమార్‌, జె.పి. పృథ్వీ, రుబాబు, కాదంబరి కిరణ్‌, విద్యుల్లేఖా రామన్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, భద్రం, నల్ల వేణు, రాహుల్‌ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్‌, సంధ్యా జనక్‌, ఫిష్‌ వెంకట్‌, శ్రీహర్ష, శివమ్‌ మల్హోత్రా, రవిరామ్‌ తేజ, తేజారెడ్డి నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, సంగీతం: థమన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: వెంకట్‌, డాన్స్‌: శేఖర్‌, జాని, సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా, నిర్మాత: సి.కళ్యాణ్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here