మహేష్ కత్తి పై హైపర్ ఆది పంచ్!

హైపర్ ఆది పంచ్ లు ఎంత ఘాతూగో ఉంటాయో మనందరికీ తెలుసు. కేవలం ఆ పంచ్ డైలాగుల వల్లే అతి తక్కువ కలం లో జబర్దస్త్ లో టాప్ పోసిషన్ కి చేరుకున్నాడు ఆది. సినిమాల్లో కూడా అడపా తడప పాత్రలు వేస్తున్నాడు కూడా.
Hyper Aadi punch dialogue on Mahesh Kathi review
అయితే హైపర్ ఆది పంచ్ డైలాగులు శృతి మించాయని, ఆడవారిని కించపరిచేలా ఉన్నాయని అభియోగాలు ఉన్నాయి. తాజాగా హైపర్ ఆది మరో వివాదాస్పద పంచ్ డైలాగు వేసాడు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసి, ఎన్టీఆర్ నిర్వహించిన బిగ్ బాస్ రియాలిటీ షో లో మెరిసిన సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి మీద సెటైర్లు విసిరాడు ఆది.
“సిక్స్-ప్యాక్ చేయడం సినిమాతీయడం లాంటిది, అది చాల కష్టమైనా పని. కానీ రివ్యూ రాయడం ఈజీ, పొట్ట-బట్ట ఉన్న ప్రతి వాడు రాసేస్తాడు” అని ఛలోక్తులేసాడు హైపర్ కమెడియన్. రాబోవు జబర్దస్త్ ప్రచారం కాబోయే స్కిట్ లోని ఆ డైలాగును టీవీ లో ప్రచారం చేస్తున్నారు. మరి ఈ పంచ్ కు కత్తి ఎలా స్పందిస్తారో చూడాలి