మార్చి 16 నుండి నితిన్‌, దిల్‌రాజు `శ్రీనివాస క‌ల్యాణం` రెగ్యుల‌ర్ షూటింగ్

ఎన్నో విజ‌యవంతమైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్రముఖ నిర్మాణ‌ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై… 14 ఏళ్ల క్రితం హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు, యువ హీరో నితిన్ కాంబినేషన్లో వచ్చిన ‘దిల్’ సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయ్యిందో తెలిసిందే. అటువంటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కనున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `శ్రీనివాస క‌ల్యాణం`. గ‌త ఏడాది జాతీయ స్థాయిలో ఉత్త‌మ ప్ర‌జాద‌ర‌ణ పొందిన `శ‌త‌మానం భ‌వ‌తి` చిత్రాన్ని  రూపొందించిన‌ డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.నితిన్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా, నందిత శ్వేత హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.
మార్చి 16 నుండి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్ మార్చి 30 వ‌ర‌కు జ‌రుగుతుంది. జూన్‌కంతా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేయ‌డ‌మే కాకుండా.. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను కూడా కంప్లీట్ చేసి జూలై చివ‌రి వారం లేదా ఆగ‌స్ట్ మొద‌టి వారంలో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కి జె.మేయ‌ర్ సంగీతాన్ని, స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.
నితిన్‌, రాశీఖ‌న్నా, నందితా శ్వేత‌, ప్ర‌కాష్ రాజ్ త‌దిత‌రులు ముఖ్య తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్:  రామాంజ‌నేయులు, ఎడిటింగ్‌: మ‌ధు, సినిమాటోగ్ర‌ఫీ: స‌మీర్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ : బండి రత్న కుమార్, సంగీతం:  మిక్కి జె.మేయ‌ర్‌, నిర్మాణం: శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, కధ, మాటలు, స్క్రీన్ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  స‌తీశ్ వేగేశ్న‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here