మా` ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా ` ఏడిద శ్రీరామ్ పుట్టినరోజు వేడుక‌!

సీనియ‌ర్ న‌టుడు, `మా` అసోసియేష‌న్ జాయింట్ సెక్ర‌ట‌రీ ఏడిద శ్రీరామ్ పుట్టిన రోజు (నేడు). ఈ సంద‌ర్భంగా `మా` కార్యాల‌యంలో మెంబ‌ర్లు..స‌భ్యుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌న్మ‌దినోత్స‌వం జ‌రిగింది. ముందుగా `మా` అధ్య‌క్షుడు శివాజీ రాజా, శ్రీరామ్ కు కేక్ తినిపించి శుభాకాంక్ష‌లు తెలిపారు.
అనంత‌రం `మా`  వైస్ ప్రెసిడెంట్ ఎమ్. వి. బెన‌ర్జీ,  జాయింట్ సెక్ర‌ట‌రీ హేమ‌, క‌ల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ కొండేటి, కార్య‌వ‌ర్గ స‌భ్యుడు సురేష్  శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా  శ్రీరామ్ ను `మా` త‌రుపున సాలువా తో  స‌న్మానించారు. అలాగే `మా` ఘ‌నంగా నిర్వ‌హిస్తోన్న సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల్లో భాగంగా `మా` 25 వ‌సంతాల‌ జ్ఞాపిక‌ను కూడా అంద‌జేశారు. అనంత‌రం  శ్రీరామ్ , పేద‌క‌ళాకారుల‌కు స‌హాయార్ధం  రూ.5000 ల‌ను `మా` కు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో `మా` కు సంబంధించిన ప‌లువురు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here